Rajnath Singh: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సాయుధ దళాల సిబ్బందికి బహుమతులు
సాయుధ దళాల సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నగదు బహుమతులను ప్రకటించారు.
- Author : Balu J
Date : 18-10-2023 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
Rajnath Singh: 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సాయుధ దళాల సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నగదు బహుమతులను ప్రకటించారు. బంగారు పతకం సాధించిన వారికి 25 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 15 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. దిల్లీలో జరిగిన ఢిపెన్స్ సర్వీసెస్ క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో పతకాలు సాధించిన వారిని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఈ పతకాలు, ప్రదర్శనలు దేశ యువత క్రీడా రంగంలో ముందుకు రావడానికి స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థే కాకుండా క్రీడారంగంతో పాటూ అన్ని రంగాలు అగ్రభాగాన దూసుకెళుతున్నాయన్నారు.
Also Read: Chandramukhi2: ఓటీటీలోకి చంద్రముఖి2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే