Nellore TDP : నెల్లూరు అర్బన్ టీడీపీ ఇంఛార్జ్‌పై దాడి.. కారుతో గుద్దించి..!
నెల్లూరు అర్బన్ టీడీపీ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో గుద్దించి పారిపోయారు. అయితే...
- By Prasad Published Date - 08:37 AM, Sun - 27 November 22

నెల్లూరు అర్బన్ టీడీపీ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో గుద్దించి పారిపోయారు. అయితే ఇది అధికార పార్టీ నేతల పనిగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఈ దాడి చేశారని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి త్రీవంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసుల రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్‌లో పరామర్శించారు.