Somu Veerraju: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: సోము వీర్రాజు
- Author : Anshu
Date : 05-06-2022 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా విజయవాడలో జరగనున్న ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాయని, అయితే త్వరలోనే ఎవరు మెట్టు ఎక్కుతారు ఎవరు మెట్టు దిగుతారో అన్నది కూడా తెలుస్తుంది అని సోము వీర్రాజు తెలిపారు.
అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్ లలో మొదటి ఆప్షన్ ను తామే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇక రెండవ ఆప్షన్ గురించి టిడిపిని అడగాలని మీడియాకు సూచించారు. పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు..
రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామని సోము వీర్రాజు అన్నారు. కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. వైసీపీ తీరును అందరూ తప్పుబడుతున్నారని, అందుకనే తాము ఆత్మకూరు బరిలో దిగినట్టు వివరణ ఇచ్చారు.