1Oth Results : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
- By Prasad Published Date - 12:58 PM, Mon - 6 June 22

ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన SSC పరీక్షలు మే 9న ముగిశాయి. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 414,281 మంది 67.72 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,02,821 మంది బాలురు, 2,99,088 మంది బాలికలు ఉన్నారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదవ తరగలి ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. ఫలితాలను చూసేందుకు విద్యార్థులు www.results.bse.ap.gov.inని సందర్శించాలని అధికారులు సూచించారు.విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్మీ, ఇతర ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు మాత్రం మార్కులు తప్పనిసరని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జులై మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు.