CM Jagan: ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ రెస్పాన్స్
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.
- By Praveen Aluthuru Published Date - 08:04 AM, Mon - 4 December 23

CM Jagan: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మిజోరం ఎన్నికల ఫలితాలు ఈ రోజు డిసెంబర్ 4వ తేదీ సోమవారం వెలువడనున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీకి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అధికార వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఈ క్ర మంలోనే జగన్ వ చ్చే ఎన్నిక ల్లో 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. తెలుగుదేశం, జనసేన వంటి ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
Also Read: T20I Series : చివరి టీ ట్వంటీలోనూ భారత్ విక్టరీ…సిరీస్ 4-1తో కైవసం