Rahul Gandhi: రాహుల్ కు మరో ఎదురుదెబ్బ
రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనే పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ కోర్టు వెంటాడుతున్న "మోడీ" ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులు
- By Maheswara Rao Nadella Published Date - 05:46 PM, Wed - 3 May 23

Rahul Gandhi : “మోడీ” ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకుగానూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాఖలైన పరువు నష్టం దావా కేసులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వెంటాడుతున్నాయి. దీనికి సంబంధించి గుజరాత్ లో నమోదైన కేసులో ఇప్పటికే సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో ఇదే అంశమై జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రదీప్ మోడీ అనే న్యాయవాది రాహుల్ పై జార్ఖండ్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపును కల్పించాలంటూ రాహుల్ (Rahul Gandhi) వేసిన పిటిషన్ ను కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో ఆయన తప్పనిసరిగా జార్ఖండ్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీపై మొత్తం మూడు పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక కేసు చైబాసాలో, రెండు కేసులు రాంచీలో నమోదయ్యాయి.
Also Read: UIDAI Update: ఆధార్ తో మొబైల్ నంబరు లింక్ చేశారా ? ఇలా తెలుసుకోండి..