Nellore TDP : నెల్లూరు టీడీపీలో కీలక పరిణామాలు.. హైదరాబాద్‌లో చంద్రబాబుతో ఆనం భేటీ
నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు
- By Prasad Published Date - 08:27 AM, Sat - 10 June 23

నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు.తాజాగా ఆయన టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్న(శుక్రవారం) రాత్రి హైదరాబాద్‌లో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య సమావేశం సాగింది. నెల్లూరు జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే లోకేష్ యవగళం పాదయాత్రలో ఆనం చేరిక ఉంటుందని సమాచారం.