COVID-19: 24 గంటల్లో 752 కొత్త COVID-19 కేసులు, 4 మరణాలు
నూతన సంవత్సరానికి ముందు కరోనా ప్రభావం భయాందోళనకు గురి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మేరకు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
- By Praveen Aluthuru Published Date - 07:52 PM, Tue - 26 December 23

COVID-19: నూతన సంవత్సరానికి ముందు కరోనా ప్రభావం భయాందోళనకు గురి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మేరకు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో ఒకే రోజు 752 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మే 21, 2023 నుండి ఇదే అత్యధికం.
దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరు, రాజస్థాన్ మరియు కర్ణాటకలో ఒక్కొక్కరు మరణించారు. 24 గంటల్లోనే నలుగురు మరణించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4.50 కోట్లకు చేరింది (4,50,07,964). ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,212కి పెరిగింది మరియు జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది.