Kishtwar: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్.. 12 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ (Kishtwar)లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం (Accident)లో ఆరుగురు మరణించారు.
- Author : Gopichand
Date : 24-05-2023 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
Kishtwar: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ (Kishtwar)లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం (Accident)లో ఆరుగురు మరణించారు. అందిన సమాచారం ప్రకారం.. దగ్దూర్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ప్రయాణిస్తున్న క్రూజర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కిష్త్వార్‌లోని దచాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదాన్ని ధృవీకరించిన జిల్లా ఎస్‌ఎస్‌పి కిష్త్వార్ ఖలీల్ పోస్వాల్ ఆరుగురు మరణించినట్లు నివేదించారు. దాదాపు డజను మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంది. సహాయక సిబ్బంది బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతులను వెంటనే గుర్తించలేకపోయినా వారంతా కూలీలు అయ్యి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు
సమాచారం ప్రకారం దచ్చన్ సమీపంలోని దగ్దూర్ వద్ద ప్రమాదం జరిగింది. దగ్దూర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కింద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పని చేసే కూలీల బృందం ట్రక్కులో తమ పని ప్రదేశానికి వెళుతోంది. ఇంతలో మలుపు వద్ద అకస్మాత్తుగా ముందు నుంచి కారు వచ్చి రెండు వాహనాలు ఢీకొన్నాయి.