Earthquake: తైవాన్ రాజధాని తైపీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతగా నమోదు..!
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి.
- By Gopichand Published Date - 08:28 AM, Tue - 24 October 23

Earthquake: తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ద్వీపం తూర్పు తీరానికి సమీపంలో ఉన్న సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపింది. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. రాజధాని ఖాట్మండులో ఈరోజు (అక్టోబర్ 24) తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Also Read: Israel – Obama : ఇజ్రాయెల్‌కు ఒబామా వార్నింగ్.. ఏమన్నారంటే ?
We’re now on WhatsApp. Click to Join.
ఆదివారం నుంచి నేపాల్‌లో భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5.18 గంటలకు నేపాల్‌లో ఐదోసారి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. దాని తీవ్రత 4.3గా గుర్తించారు. నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణమయ్యాయి. గత 17 రోజుల్లో ఇది రెండో ఘటన. అంతకుముందు అక్టోబర్ 5న ఏకకాలంలో నాలుగు భూకంపాలు వచ్చాయి.