Hyderabad Voters: హైదరాబాద్ ఓటరు జాబితా నుంచి 5.41 లక్షల మంది ఔట్
- Author : Balu J
Date : 18-04-2024 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad Voters: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. మరణించిన, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలను పాటించడం ఓటరు జాబితాపై ద్రుష్టి సారించింది. 47,141 మంది మరణించిన ఓటర్లు, ఇతర కారాణాలతో 4,39,801 మంది ఓట్లు, 54,259 నకిలీ ఓటర్లను తొలగించారు. ఈ క్లీనప్ ప్రక్రియ ECI ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. మెరుగైన ఓటింగ్ జరిగిందుకే అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు.
2024 ప్రత్యేక సవరణ ఓటరు జాబితా ప్రకారం గ్రేటర్ లో 1,00,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదున్నర లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చే ఫైనల్లిస్ట్లో మరో 5 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గతేడాది అక్టోబర్ 4న ఎలక్షన్కమిషన్రిలీజ్చేసిన లిస్ట్ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో 95 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది.