HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Sreeja Reaction Ambati Rambabu House Attack

రెచ్చిపోయిన అంబటి రాంబాబు కూతురు .. ఏంటి అంత మాట అనేసింది

తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 06-02-2026 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Sreeja
Ambati Sreeja

Ambati Sreeja : ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిపై జరిగిన దాడి మరియు అరెస్టుపై అంబటి చిన్న కుమార్తె శ్రీజ చేసిన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మొత్తం ఉదంతం ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని, దీని వెనుక ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి కనుసన్నలు ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పేరు ప్రస్తావించనప్పటికీ, ఆమె వ్యాఖ్యలు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక ఉన్నత విద్యావంతుడు, వైద్యుడు అయి ఉండి ఇలాంటి దాడులను ప్రోత్సహించడం దారుణమని, తన తండ్రిని వేధించి వారు రాక్షసానందం పొందారని ఆమె వాపోయారు. రాజకీయాలతో సంబంధం లేని తమ కుటుంబ సభ్యులను కూడా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తమ ఇంటి కిటికీలు, తలుపులు, వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలనే వంకతో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారని, ఆ సమయంలో ఒక సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా ఆయనను పోలీసులు భౌతికంగా హింసించారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

తమకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని శ్రీజ ధీమా వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికంటే పదింతల మంది అభిమానులు తమకు అండగా నిలిచారని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తమ ఇంటికి వచ్చి భరోసా కల్పించారని ఆమె తెలిపారు. “రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు” అంటూ ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేస్తూ, దేవుడే తమకు రక్షణ కవచమని ఆమె పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu House Attack
  • Ambati Sreeja
  • Ambati Sreeja Reaction
  • chandrababu
  • అంబటి రాంబాబు కూతురు

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించడం, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను తెప్పించినట్లు అధికారులు సీఎంకు వివరించారు

    Latest News

    • America Attack on Iran : ఇరాన్ పై అమెరికా దాడులకు అదే కారణమా?

    • బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన పవన్

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd