Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం (Earthquake)సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు అయిందని పేర్కొంది.
- By Gopichand Published Date - 08:41 AM, Thu - 9 March 23

ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం (Earthquake)సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు అయిందని పేర్కొంది. ఫైజాబాద్‌కు 285 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉందని, ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది.
Also Read: NISAR Satellite: త్వరలో అంతరిక్షంలోకి NISAR ఉపగ్రహాం.. ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న నిసార్
అంతకుముందు బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 69.51 రేఖాంశం, 136 కి.మీ లోతులో 34.53 అక్షాంశం వద్ద సంభవించింది. భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో మధ్యాహ్నం 2:35 గంటలకు IST 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. భూకంపం 37.73 అక్షాంశం, 73.47 రేఖాంశంలో 245 కి.మీ లోతుతో సంభవించింది. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో 52,000 మందికి పైగా మరణించారు. ఒక్క టర్కీలోనే ఇప్పటివరకు 45,000 మందికి పైగా మరణించారు. నిజానికి, టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.