Tigers Death : తమిళనాడులో కనుమరుగవుతున్న పులులు.. ఏం జరుగుతుంది..?
Tigers Death తమిళనాడులో నెల రోజుల్లో 9 పెద్ద పులులు ఐదు చిన్న పులులు మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పులులను సంరక్షించడంలో
- By Ramesh Published Date - 06:14 PM, Thu - 21 September 23

Tigers Death తమిళనాడులో నెల రోజుల్లో 9 పెద్ద పులులు ఐదు చిన్న పులులు మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పులులను సంరక్షించడంలో విఫలమవుతున్నారు అధికారులు. వన్య మృగాల సంరక్షణలో భాగంగా అటవీ శాఖ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పెద్ద పులులను కాపాడలేకపోతున్నారు. దట్టమైన అడవుల్లో కొన్ని వేటగాళ్ల బారిన పడి మృతి చెందుతుంటే మరికొన్ని ప్రమాదవ శాత్తు మరణిస్తున్నాయి.
తమిళనాడులో పెద్ద పులుల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఊటీ సమీపంలో చిన కూనూర్ దగ్గరలోని సెగూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో రెండు పులి పిల్లలు చనిపోయినట్టు అటవీ అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య చాలా తక్కువగా ఉండగా ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ ఎంత జాగ్రత్త పడుతున్నా సరే ఈ పులుల మరణాలను ఆపలేకపోతున్నారు.
ముఖ్యంగా తమిళనాడు లో నెల రోజుల వ్యవధిలో 9 పెద్ద పులులు 5 చిన్న పులులు (Tigers Death) మృతి చెందడం కేంద్రం ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉంది. అటవీ శాఖ తగిన జాగ్రత్తలు పాటించాలని చూస్తున్నారు. చనిపోయిన పులి పిల్లలకు పోస్టు మార్టం చేసిన పోలీసులు వాటిని దహనం చేశారు. వరుస పులుల మరణాల వల్ల ఆందోళన చెందుతున్న అధికారులు పులుల మరణాలపై విచారణ చేపటాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలాఉంటే ఈ సందర్భంగానే ఒక సంఘటన బయటకు వచ్చింది. తన ఆవుని చంపాయన్న పగతో పెద్ద పులులకు విషయం పెట్టి చంపిన విషయం తెలిసిందే. ఆవు కళేబరాలకు విషం రాసి పులులను చంపాడు ఆ రైతు. అలా చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రపంచం మొత్తం పుల్లో మూడొంతులకు పైగా మన దేశంలోనే ఉన్నాయి. కొన్నాళ్లుగా వీటి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ టైంలో పులుల మీద వేటగాళ్ల కన్ను పడింది. మరి ఈ పులులను కాపాడుకునేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read : Signature Loans : బ్యాంక్ లో సిగ్నేచర్ లోన్ గురించి మీకు తెలుసా..?