2 Killed : లాస్ వెగాస్‌లో దారుణం .. దుండగుల దాడిలో ఇద్దరు మృతి మరో ఆరుగురు..?
లాస్ వెగాస్‌లో దారుణం చోటుచేసుకుంది. వైన్ క్యాసినో ముందు గురువారం జరిగిన దుండగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు
- By Prasad Published Date - 07:50 AM, Fri - 7 October 22

లాస్ వెగాస్‌లో దారుణం చోటుచేసుకుంది. వైన్ క్యాసినో ముందు గురువారం జరిగిన దుండగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. లాస్ వెగాస్ బౌలేవార్డ్‌లో ఉదయం 11:40 గంటలకు దుండగుల దాడి జరిగిందని తమ ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎనిమిది మంది బాధితుల్లో ఇద్దరు మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాంలో పోలీసులు వంటగదిలో ఉపయోగించే కత్తిని స్వాధీనం చేసుకున్నారు.