Double Bedrooms: డబుల్ బెడ్రూం ఇళ్లు.. ప్రారంభానికి సిద్ధం!
- By Balu J Published Date - 07:55 PM, Sun - 23 January 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆత్మగౌరవం కోసం డబూల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకగుణంగానే అర్హులైన లబ్ధిదారులకు పలుచోట్ల అద్భుతమైన ఇళ్లను నిర్మించి సొంతింటి కలను నిజం చేసింది. హైదరాబాద్ లో అర్హులైన పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని ఇళ్లను నిర్మించింది. హైదరాబాద్ శివారులోని, కొల్లూరు లో 124ఎకరాల విస్తీర్ణం లో రూ.1355 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఒకటి వైరల్ అవుతోంది. చూసినవాళ్లు చాలామంది గేటెడ్ కమ్యూనిటి ఇళ్ల తరహాలో ఉన్నాయని అనుకుంటున్నారు.