Mexico Bar: అమెరికాలో విషాద ఘటన.. బార్‌కు నిప్పంటించడంతో 11 మంది మృతి
ఉత్తర అమెరికా-మెక్సికన్ సరిహద్దు పట్టణం శాన్ లూయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి బార్ (Mexico Bar)కు నిప్పంటించడంతో 11 మంది చనిపోయారు.
- Author : Gopichand
Date : 23-07-2023 - 7:35 IST
Published By : Hashtagu Telugu Desk
Mexico Bar: ఉత్తర అమెరికా-మెక్సికన్ సరిహద్దు పట్టణం శాన్ లూయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి బార్ (Mexico Bar)కు నిప్పంటించడంతో 11 మంది చనిపోయారు. మెక్సికోలోని ఓ వ్యక్తి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బార్ నుండి బయటకు వెళ్లగొట్టిన వ్యక్తి తిరిగి వచ్చి నిప్పంటించాడని అధికారులు శనివారం తెలిపారు. ఈ మేరకు వార్తా సంస్థ AFP వెల్లడించింది.
ఈ ఘటనలో 11 మంది చనిపోయారు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర రాష్ట్రమైన సోనోరాలోని శాన్ లూయిస్ రియో కొలరాడో నగరంలో శుక్రవారం రాత్రిపూట ఈ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు సహా మొత్తం 11 మంది మృతి చెందగా, మిగిలిన నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు.
Also Read: Bus Falls Into Pond : చెరువులో మునిగిన బస్సు.. ఊపిరాడక బస్సులోనే 17 మంది మృతి
దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో రోములో సలాస్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదంలో మరణించిన మహిళల్లో ఒకరు US పౌరురాలు అని, బాధితుల్లో ఒకరికి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర మేయర్ శాంటోస్ గొంజాలెజ్ తెలిపారు.