11 arrested: ఢిల్లీలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్, 11 మంది అరెస్ట్!
దేశ రాజధానిలోని షహదారా జిల్లాలోని కస్తూర్బా నగర్‌లో ఒక మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి,
- By Balu J Published Date - 03:18 PM, Fri - 28 January 22
దేశ రాజధానిలోని షహదారా జిల్లాలోని కస్తూర్బా నగర్‌లో ఒక మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, ముఖానికి ఇంక్ పూసి వీధుల్లో ఊరేగించిన ఘటనకు సంబంధించి 9 మంది మహిళలతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. మహిళకు గుండు గీసి, మెడలో బూట్ల దండతో ఊరేగించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 11 మందిలో తొమ్మిది మంది మహిళలేనని, త్వరలో మరిన్ని అరెస్టులు చేస్తామని ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన సంఘటన గురించి మహిళ భర్త ద్వారా వారికి సమాచారం అందిందింది. అయితే అతను సంఘటన స్థలంలో లేడు, కానీ అతని యజమాని ద్వారా సమాచారం తెలుసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి నుండి 20 ఏళ్ల యువతిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. సామూహిక అత్యాచారం, శారీరక దాడి, లైంగిక వేధింపులు, నేరపూరిత కుట్రతో సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి సోదరి వివరాల ప్రకారం.. గతేడాది నవంబర్‌లో మహిళను ప్రేమిస్తున్నానంటూ పొరుగున ఉంటున్న ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ బాలుడి మరణానికి నా సోదరి కారణమని, కుటుంబం పగబట్టి ఈ చర్యకు పాల్పడిందని తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇది సిగ్గుమాలిన చర్య అని పేర్కొంటూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ప్రాణాలతో బయటపడిన యువతి కుటుంబానికి భద్రత కల్పించడానికి త్వరిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. “వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఒక మహిళపై లైంగిక వేధింపుల దురదృష్టకర సంఘటన షహదారా జిల్లాలో జరిగింది” అని షహదారా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ సత్యసుందరం అన్నారు. “పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలికి అన్ని విధాలా సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నామని డీసీపీ తెలిపారు.
ये बेहद शर्मनाक है। अपराधियों की इतनी हिम्मत हो कैसे गई? केंद्रीय गृहमंत्री जी और उपराज्यपाल जी से मैं आग्रह करता हूँ कि पुलिस को सख़्त एक्शन लेने के निर्देश दें, क़ानून व्यवस्था पर ध्यान दें। दिल्लीवासी इस तरह के जघन्य अपराध और अपराधियों को किसी भी क़ीमत पर बर्दाश्त नहीं करेंगे। https://t.co/aAinx2Sbti
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2022