Gym Roof Collapse : జిమ్ పైకప్పు కూలి 10 మంది మృతి.. ఎలా జరిగిందంటే ?
Gym Roof Collapse : వాళ్ళు జిమ్ లో ఉత్సాహంగా జిమ్ చేస్తున్నారు.. మ్యూజిక్ సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు..ఇంతలో ఏదో జరిగింది.. వాళ్ళ తలపై ఏదో పడింది..
- By Pasha Published Date - 08:50 AM, Mon - 24 July 23
Gym Roof Collapse : వాళ్ళు జిమ్ లో ఉత్సాహంగా వ్యాయామం చేస్తున్నారు..
మ్యూజిక్ సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు..
ఇంతలో ఏదో జరిగింది..
వాళ్ళ తలపై ఏదో పడింది..
అదే.. జిమ్ పైకప్పు..
జిమ్ చేస్తున్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పైకప్పు కుప్పకూలింది.
అందరూ పైకప్పు కింద చిక్కుకున్నారు.
ఈ ప్రమాద ఘటనలో 10 మంది చనిపోయారు.
Also read : Loan Default: మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా..? అయితే లోన్ లు కష్టమే..!
చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ క్వికిహార్‌లో ఉన్న నెం. 34 మిడిల్ స్కూల్ జిమ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిమ్ పైకప్పు కింద నలిగి 10 మంది ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. సహాయక చర్యల్లో దాదాపు 160 మంది అగ్నిమాపక సిబ్బంది, 39 అగ్నిమాపక ట్రక్కులు పాల్గొన్నాయి. భవనం పైకప్పుపై వేసిన పెర్లైట్ మెటీరియల్ లేయర్.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరిగిపోయి పైకప్పు పై ఒత్తిడిని పెంచిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కారణం వల్లే పైకప్పు కూలిపోయిందని వెల్లడైంది. ఈవిధంగా భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. 2015లో టియాంజిన్‌లోని ఒక రసాయన గిడ్డంగిలో ఇలాంటిదే ఘోర ప్రమాదం జరిగి, భారీ పేలుడు సంభవించి 165 మంది మరణించారు.