MLA Sridevi : సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. దోచుకో దాచుకోవడమే..!
సీఎం జగన్‌పై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దోచుకో దాచుకో అన్నట్లు
- Author : Prasad
Date : 26-03-2023 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం జగన్‌పై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దోచుకో దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్దండరాయునిపాలెంలో ఉన్న ప్రజాసంపదను ఎవరు దోచుకుంటున్నారో సీఎం జగన్ చెప్పాలన్నారు. తన ఆఫీస్‌పైకి వైసీపీ గుండాలను పంపించి దాడి చేపించారని ఆమె ఆరోపించారు. వైసీపీ గుండాలను రకరకాలుగా తనను వేధిస్తున్నారన్నారు. జగనన్న ఇళ్ల పథకంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. అమరావతిలో ఒక్క ఇటుకైనా సీఎం జగన్ పెట్టారా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందన్న జగన్.. ఆ తరువాత మాట మార్చారని ఆమె తెలిపారు. నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నేను పోరాడుతానంటూ అమరావతి రైతులకు ఆమె హమీ ఇచ్చారు.