HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >What Rights Do You Have As A Human Being

International Human Rights Day: మనిషిగా మీకు ఉన్న హక్కులు?

అంతర్జాతీయ ఒప్పందంపై అవగాహన కల్పించడానికి 1948 నుంచి ఏటా డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’

  • By Maheswara Rao Nadella Published Date - 03:04 PM, Sat - 10 December 22
  • daily-hunt
International Human Rights Day
Hujman Rights

హక్కులు (Rights) లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా (Independent) జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు (Rights) సహకరిస్తాయి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్ష లేకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1948 డిసెంబరు 10న పారిస్ వేదికగా సభ్య దేశాలన్నీ ఓ కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మానవహక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

మానవ హక్కులు (Rights) అనేవి వ్యక్తి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కోసం ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందంపై అవగాహన కల్పించడానికి 1948 నుంచి ఏటా డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ (International Human Rights Day) నిర్వహించుకుంటున్నాం. అయితే, 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతే మానవ హక్కుల దినోత్సవం జరపాలన్న ఆలోచన వచ్చింది. శాంతి నెలకొల్పాలన్న ఆకాంక్ష కూడా ఈ ప్రకటనలో ఇమిడి ఉంది. ప్రపంచ యుద్ధం తర్వాత అనేక సోషలిస్టు ప్రజాస్వామ్య దేశాల ఆవిష్కరణ జరిగింది. అయినా వివిధ దేశాల లోపల బయట కూడా మానవ హక్కుల ‘హననం’ జరుగుతూనే ఉంది.

శాస్త్ర, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలు తమ ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురాగతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. భారత స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్‌ హన్స్‌ జీవరాజ్‌ మెహతాతో పాటు వివిధ దేశాలు, సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి ఈ ప్రకటనను రూపొందించారు.

అప్పటి నుంచి ఏటా డిసెంబరు 10 ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఓ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని మానవహక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘అందరికీ గౌరవం, స్వేచ్ఛ, న్యాయం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోనున్నారు.

హక్కుల రక్షణకు పునాదిగా ఐరాస ప్రకటన:

ఐరాస మానవ హక్కుల ప్రకటన భారత్‌ సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తోంది. ఐరాసలోని సభ్యదేశాల పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు; అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడింది. ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’పై అన్ని సభ్య దేశాలను, సంస్థలను ఆహ్వానించి సాధారణ సభ 423 (ఐ) తీర్మానానికి ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అన్ని దేశాలూ డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మానవ హక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఒక హైకమిషనర్‌ను ఐరాస నియమించింది.

మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించిన అంశమే మాత్రమే కాదు.. సార్వత్రిక, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులు ముఖ్యంగా ఐరాస, లాటిన్ అమెరికాల సహకారంతో ప్రారంభమైంది. ప్రభుత్వాలు, పాలకులు నిరంకుశ ధోరణితో ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.

భారత్‌లో మానవహక్కుల పరిరక్షణ చట్టం:

భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా రాజ్యాంగబద్ధతలేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సక్రమంగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుడి జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది.

విశ్వమానవ హక్కుల ప్రకటన:

భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడటం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరిస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు రోజూ మనం చూస్తునే ఉన్నారు. కొంతమంది ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌ 10న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది.

సమాజంలోని కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది. ఈ ఆధిపత్య వాదమే- బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషాపరమైన అమానుషాలకు కారణమవుతోంది. 1857లో ‘డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ శాండ్‌ ఫోర్డ్‌’ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్లజాతీయులు దేశ పౌరులు కారని తీర్పు చెప్పిందంటే.. వారి నరానరాన జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

తరవాత 1886లో అదే కోర్టు అమెరికా కంపెనీలకు దేశ పౌరసత్వం కల్పించింది. అమెరికాలో నల్లజాతీయుల కంటే ముందుగా కంపెనీలకు పౌరసత్వ హక్కులు లభించడం గమనార్హం. మనుషులకన్నా కంపెనీలే అధికమంటున్న ఆ తీర్పు కంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి దురాగతాలను నివారించడానికి ఐరాస మానవ హక్కుల ప్రకటన మనుషులంతా సమానులేనని ఉద్ఘాటించింది. మానవ హక్కులు ప్రాథమిక హక్కులే. వాటిని ఎవరూ హరించలేరు. ప్రజాప్రయోజనాల కోసం ఎంతో అవసరమైతే తప్ప ప్రభుత్వాలూ వాటిని సస్పెండ్‌ చేయలేవు.

ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురి కారాదు.

మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు..

  1. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం.
  2. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడటం.
  3. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ.
  4. నిర్బంధం లేని జీవన విధానం.
  5. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు.
  6. సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు.
  7. బలవంతపు పనుల నుంచి విముక్తి.
  8. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ.
  9. భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు.
  10. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు.

ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి ఇబ్బందులకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడుతాయి.

Also Read:  Anti Corruption Day : అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Human Rights Day
  • india
  • special day
  • today

Related News

India

India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ సౌత్ కొరియాతో తలపడుతుంది. అంతకుముందు సూపర్-4లో భారత్ సౌత్ కొరియాతో తలపడింది. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

  • Funding for Khalistani terrorists comes from Canada: Canadian report reveals..!

    Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • British officials inspect Tihar Jail.. Will they extradite Nirav Modi and Mallya to India..?!

    Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • Total lunar eclipse on the 7th..Which zodiac signs are auspicious according to astrology? Which zodiac signs are inauspicious?..!

    Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Latest News

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd