Bride Escape with Money : పెళ్లైన రెండు నెలలు.. మొత్తం డబ్బుతో ఉడాయించిన యువతి.
అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి (Bride) చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 04-07-2023 - 1:05 IST
Published By : Hashtagu Telugu Desk
Bride Escape with Money : అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణకాలనీకి చెందిన సుద్దాల రేవంత్‌కు గతంలో వివాహం కాగా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం మరలా వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఈ సమయంలో తన వివరాలను సోషల్లో మీడియాలో పోస్టు చేశాడు. వరంగల్ జిల్లా నెక్కొండగా పేర్కొంటూ ఓ యువతి అంగీకారం తెలపడంతో పెద్ద మనుషుల సమక్షంలో 14-12-2022లో భీమునిపట్నంలోని చిలుకలయ్యగుడిలో పెళ్లి జరిపించారు. రెండు నెలలు కలిసి ఉన్న అనంతరం ఆ యువతి (Bride) ప్రవర్తనలో చిన్నగా మార్పు మొదలైంది తనకు మద్యం అలవాటు ఉందంటూ రోజూ రేవంత్‌ను వేధించసాగింది.
ఇంట్లో గొడవ పెట్టుకొని తన సోదరి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. ఫిబ్రవరిలో రూ. 70 వేల నగదు, నాలుగు తులాల బంగారం పట్టుకొని వెళ్లిపోయింది. ఆమెకు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో ఆమె తల్లిదండ్రులను, స్నేహితులను రేవంత్ ఎంక్వయిరీ చేశాడు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నట్లు గుర్తించి తీసుకురావటానికి వెళ్లగా కొందరు బంధించి తనపై దాడి చేశారని భర్త రేవంత్ తెలిపాడు. దగ్గర్లొని పోలీసుస్టేషన్‌లో తనపైనే తప్పుడు ఫిర్యాదు చేశారని.. తనను వేధిస్తూ రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారని రేవంత్ తెలిపాడు . ఆమెకు ఇదివరకే మూడు వివాహాలు అయ్యాయని రేవంత్ ఆరోపిస్తున్నాడు. ఇటీవల అతను ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై జీవన్ తెలిపారు.
Also Read: Sitara Ghattamaneni : ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో మహేష్ బాబు కూతరు సితార!