Stock Market Movies : స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉందా ? చూడాల్సిన టాప్-6 మూవీస్ ఇవే
స్టాక్ మార్కెట్ కదలికలపై, షేర్ల కదలికలపై మన అంచనాలు తప్పితే భారీ నష్టమే మిగులుతుంది.
- By Pasha Published Date - 04:41 PM, Sun - 1 September 24
Stock Market Movies : నేటికాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో రెండు రకాల ట్రేడింగ్లు చేయొచ్చు. మొదటిది ఇంట్రాడే ట్రేడింగ్, రెండోది డెలివరీ ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒక్కరోజుకే పరిమితం. అందుకే ఇందులో భాగంగా ఏదైనా షేరును కొన్నా/అమ్మినా దానికి సంబంధించిన డీల్‌ను ఆరోజే పూర్తిచేయాలి. ఫలితంగా ఇంట్రాడే ట్రేడింగులో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. స్టాక్ మార్కెట్ కదలికలపై, షేర్ల కదలికలపై మన అంచనాలు తప్పితే భారీ నష్టమే మిగులుతుంది. కానీ డెలివరీ ట్రేడింగులో మనం ఏదైనా షేరును కొంటే దాన్ని ఎప్పటికీ ఉంచుకోవచ్చు. ధర భారీగా పెరిగినప్పుడే అమ్మొచ్చు. లాంగ్ టర్మ్ లక్ష్యంతో పెట్టుబడి పెట్టే వారికి డెలివరీ ట్రేడింగ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు ఆదాయం కావాలి అనుకునే వారికి ఇంట్రాడే ట్రేడింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే అందులో డబ్బంతా కోల్పోయే ముప్పు ఉంటుందని గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్‌పై ఇప్పటిదాకా వచ్చిన కొన్ని ఫేమస్ సినిమాల(Stock Market Movies) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- హర్షద్ మెహతా భారత స్టాక్ మార్కెట్లో చాలా ఫేమస్ ట్రేడర్. ఆయనపై తీసిన వెబ్ సిరీస్ టైటిల్ Scam 1992: The Harshad Mehta Story. హర్షద్ మెహతా తొలుత ఒక బిగ్ బుల్ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత పతనం అయ్యారు. ఇదంతా ఎలా జరిగిందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి.
- ఒక స్టాక్ ట్రేడర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా టైటిల్ Bazaar. ఇన్సైడర్ ట్రేడింగ్, కరప్ట్ నెట్‌వర్క్‌ల గురించి ఈ మూవీలో చక్కగా చూపించారు. స్టాక్ మార్కెట్లో లోలోపల జరిగే మోసాల గురించి ఈ మూవీలో చక్కగా చూపించారు.
- అమెరికా స్టాక్ మార్కెట్‌ను వాల్ స్ట్రీట్ అంటారు. అక్కడి ట్రేడర్ల దురాశను Wall Street మూవీలో చక్కగా చూపించారు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లైనా ఇంకా ఫ్రెష్‌గానే కనిపిస్తుంది.
- 2008 సంవత్సరంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. అయితే అంతకంటే ముందు ఏమేం జరిగాయి అనేది తెలుసుకోవాలంటే The Big Short మూవీని చూడాలి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఎలా పనిచేస్తాయో దీనిలో బాగా చూపించారు.
- న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే టిప్స్ చూసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్లు తీవ్రంగా నష్టపోతుంటారు. అలా నష్టపోతున్న వారందరి కథను కళ్లకు కట్టేలా Money Monster మూవీని తీశారు.
- అమెరికాలోని పెట్టుబడిదారీ విధానాన్ని ప్రధానంగా చూపిస్తూ తీసిన డాక్యుమెంటరీ టైటిల్ Capitalism: A Love Story. పెట్టుబడిదారీ విధానం వల్ల ధనవంతులు, దురాశాపరులే లాభపడటాన్ని ఇందులో చక్కగా ప్రజెంట్ చేశారు.
Related News
Stock Market LIVE: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ , ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు నష్టం
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1,017 పాయింట్లు పడిపోయింది, ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లు కోల్పోయారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు లేదా 1.17 శాతం క్షీణించి 24,852 వద్ద ఉన్నాయి.