HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >National Handloom Day Do You Know Why National Watermelon Day Is Celebrated

National Handloom Day : జాతీయ చేనేత దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రాథమిక లక్ష్యం చేనేతను ప్రోత్సహించడం

  • By Sudheer Published Date - 07:05 PM, Mon - 7 August 23
  • daily-hunt
National Handloom Day
National Handloom Day

 

National Handloom Day : జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 7 న భారతదేశం అంతటా జరుపుకుంటారు. చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రాథమిక లక్ష్యం చేనేతను ప్రోత్సహించడం మరియు ఈ రంగంలో నిమగ్నమైన నేత కార్మికుల ప్రయత్నాలను నైపుణ్యాలను గుర్తించడం.

భారతీయత అంటే ఎవరికైనా మొదటగా గుర్తుకొచ్చేది చేనేత. కనులకు ఇంపుగా రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత రంగానికి, నేత పనివారికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనువేసుకొని, భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతుంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది. వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి. రెండువేల సంవత్సరాల క్రితం `హంస’ డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టు కైరో నగరంలో లభ్యమయ్యాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనచరిత్ర ఉన్న దేశం మనది.

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ ఆగస్ట్, 07 , 2015 తేదిని `జాతీయ చేనేత దినోత్సవం’ (National Handloom Day) గా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీనిని మనం జరుపుకుంటున్నాము. 7 ఆగస్ట్ చారిత్రాత్మకమైన రోజు.

1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. అప్పటి జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, శ్రీ లాలా లాజపత్ రాయ్, శ్రీ అరవిందో ఘోష్ ( తర్వాతిక కాలంలో మహర్షి అరవిoదులవారు), శ్రీ బిపిన్చంద్ర పాల్ స్వదేశి ఉద్యమసారధులు. ఈ చారిత్రక నేపధ్యాన్ని గుర్తు చేసుకుని అదే సంకల్పంతో చేనేత దినోత్సవాన్ని ప్రజలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయంగా `ఇండియా హ్యాండ్లూమ్’ చేనేత బ్రాండ్ ఆవిష్కరించడమేకాక, `సంత్ కబీర్’ పేరుమీద చేనేత కళాకారులకి అవార్డులు ప్రదానం చేస్తున్నది.

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

చేనేత అంటే..

చేనేత, ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ. పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, కత్రి, సెంగుందం ల కుల వృత్తి. ఈ పరిశ్రమకు స్నుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి. పడుగు (వార్పు), పేక (ఫిల్లింగ్ థ్రెడ్‌)లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడే విధానాన్ని నేత అంటారు. నిలువు వరుస దారాలను కలిపి ‘పడుగు’ అని, అడ్డు వరుస దారాలను కలిపి ‘పేక’ అని పిలుస్తారు. అందులో చేతితో మగ్గంపై నేతనేసే విధానాన్ని చేనేత అంటారు. నేసిన ఉత్పత్తులు సాదా నేత, శాటిన్ నేత, లేదా ట్విల్ నేత అనే మూడు ప్రాథమిక దశల్లో ఒకదానితో సృష్టించబడతాయి.

చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా, కళాత్మకంగా, నైపుణ్యంతో కూడిన పని కావడంతో దీనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సివుంటుంది. చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళను నేర్చుకుంటారు.

చేనేత చరిత్ర :

క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో, మెరోయ్‌లో పత్తి సాగు, దాని స్పిన్నింగ్, నేయడం మొదలైన జ్ఞానం ఉన్నత స్థాయికి చేరుకుంది. కుష్ రాజ్యం ఆదాయంలోని ప్రధాన వనరులలో వస్త్రాల ఎగుమతి ఒకటి. అక్సుమైట్ రాజు ఎజానా తన శాసనంలో మెరోయ్‌లో తన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో పెద్ద పత్తి తోటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాడు. ఈ చేనేత వృత్తిని అందరు చేస్తారు. కాకపోతే ఎక్కువమంది పురుషులు మగ్గం నేసేవారు కాగా, మహిళలు నేతకు అవసరమైన దారాన్ని సరిచేసే పనులను నిర్వహిస్తారు. అక్కడక్కడ కొంతమంది మహిళలు కూడా మగ్గం నేస్తుంటారు.

భారత దేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఆంధ్రా, ఒడిస్సాల నుంచి నూలు ఇకత్ మరియు జామ్దని, బనారస్ పట్టు, జరీలు, కంచి /తమిళనాడు పట్టు, గుజరాత్ రాజస్థాన్ టై & డై, సూరత్ టాoచౌ, పంజాబ్ పుల్కారి, బెంగాల్ ఢకై, బాలుచరి సిల్క్, అస్సాం మూగా సిల్క్, మహేశ్వరీ జరీ, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, మధ్యప్రదేశ్/ ఆంధ్రప్రదేశ్/ ఉత్తరప్రదేశ్/ ఒడిస్సా/ బెంగాల్ టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరి ముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా మరియు శాహ్తూష్ పల్చని ఉన్ని, ఈశాన్య రాష్ట్రాల గిరిజనజాతుల రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బీహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లు, ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే భారతీయ చేనేత.

చేనేత వస్త్రం ఎలా తయారుచేస్తారంటే..

పత్తిలో గల గింజలను ముందుగా తొలగిస్తారు. ఆ తర్వాత ప్రత్తిలో గల మలినాలను చేప దంతముల ద్వారా చేసి ఎకుట పెడతారు. ఏకిన ప్రత్తిని స్థూపాకారంగా చూడతారు. రాట్నం ఉపయోగించి ప్రత్తినుండి దారం తీసి..తీసిన దారాలను గంజిని ఉపయోగించి గట్టిదనం తెస్తారు. ఆ తర్వాత మగ్గంతో వస్త్రం నేస్తారు.

చేనేత మార్కెటింగ్ :

చాలామంది నేత కార్మికులకు సొంతంగా ముడిసరకు కొని, నేసిన వాటిని షాపులకు అమ్మే అంత పెట్టుబడి కానీ, మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు. దీంతో వ్యాపారులు వారికి ముడిసరకు ఇచ్చి, బట్ట నేసిన తరువాత సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు. ఇక మరికొందరు మాత్రం సొంతంగా నేసి, షాపులకు ఇస్తారు.

చేనేత పరిశ్రమ సమస్యలు :

ఒకనాడు రంగు రంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళాడిన చేనేత మగ్గాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చేనేత మగ్గాన్ని నమ్ముకున్న వృద్ధ కార్మికులు సరైన కూలి లభించక ఇతర పనులు చేయలేక కాలం వెల్లదీస్తున్నారు.

పవర్లూమ్స్/ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తరువాత చేనేత పరిశ్రమ కుంటుపడింది. అనేక లోటుపాట్ల కారణంగా చేనేత కుటుంబాలకి గిట్టుబాటు ధర లభించట్లేదు.

ముఖ్యమైన సమస్యలు:

  • ముడి సరుకు అందుబాటులో లేకపోవడం – దారం, నూలు, చెట్ల పూల రంగులు; కొనుగోలు చేయడానికి ఎంతో దూరాలు వెళ్ళాల్సిరావడం.
    ముడిసరుకు ధరలు పెరుగుదల- కాటన్/నూలు, సిల్క్, జనప ధరలు పెరగడం; ఎరువులు పురుగు మందులు, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి.
  • చేనేత రంగంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు లేకపోవడం; ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీసావసరాలైన స్థలం, నీళ్ళు, విద్యుత్తు కూడా అందుబాటులో ఉండవు.
  • ఇది నూతన యుగం, రంగులు డిజైన్లు క్షణక్షణం మారుతుంటాయి. కొత్త డిజైన్ల కొరత పరిశ్రమను దెబ్బతీస్తోంది. ఇది చేనేత కళాకారులు చేయలేక కాదు, డబ్బు పెట్టేవాళ్ళు `రిస్క్’ లేకుండా వ్యాపారం చేయాలనుకోవడం కారణం.
  • మార్కెట్ల వ్యవస్థ సదుపాయాలు లేకపోవడం
  • చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు `పేటెంట్’ లేకపోవడం వల్ల రక్షణ లేదు, అన్ని సంప్రదాయ డిజైన్లు అనుకరించి నకళ్ళు చేస్తున్నారు.
  • చేనేత సహకార సంస్థలు రాజకీయ జోక్యం వల్ల, అవినీతి వల్ల నష్టాల పాలయాయి.
  • కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలలో సరైన నిధుల కేటాయింపులు లేకపోవడం
  • బట్టల మిల్లులు, ఫాక్టరీలు, పవర్లూముల నుంచి చేనేత పరిశ్రమ ఆన్యాయమైన పోటీ ఎదుర్కుంటోంది, చేనేత డిజైన్లు నకలు/ కాపీ చేసి,
  • పవర్లూమ్లులు అవే చేనేత అని చెప్పుకుని చెలామణి అయిపోతున్నాయి. పైగా ఫ్యాక్టరీలకి, పవర్లూములకి ప్రభుత్వ సబ్సిడీలు కూడా దొరుకుతాయి!
  • చేనేత కార్మికులకి కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేవు.

చేనేత అభివృద్ధికి కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు :

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (National Handloom Development Corporation – NHDC)
అన్ని చేనేత కేంద్రాలు, సంస్థలు, సహకార సంస్థల అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహాయం లభిస్తోంది. చేనేత కార్మికులకి ఆరోగ్య బీమా పధకాలు కూడా కల్పిస్తుంది.

దీనదయాళ్ చేనేత ప్రోత్సాహన్ యోజన :

ఇది ఒక విస్తృత కార్యక్రమం. చేనేత ఉత్పత్తుల అభివృద్ధి, రుణ సదుపాయం, చేనేత కళాకారుల శిక్షణ, సామగ్రి పరికరాల సదుపాయం, మార్కెటింగ్ వ్యవస్థ, పెట్టుబడులు, ప్రచారం, రవాణా సదుపాయo మొదలైనవన్నీ కల్పించే విస్తృత ప్రయోజనాలు కలిగిన కార్యక్రమం ఇది.

జాతీయ వస్త్ర డిజైన్ కేంద్రం (National Center for Textile Design- NCTD):

ఢిల్లీ ప్రగతి మైదాన్లో 2001 `చేనేత పెవిలియన్’ స్థాపించబడింది, సంప్రదాయ మరియు నూతన డిజైన్ల రూపకల్పన దీని ప్రధాన ఉద్దేశం. అలాగే గ్రామీణ చేనేత కళాకారులకి ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం కల్పిస్తుంది.

చేనేత ఎగుమతి అభివృద్ధి సంస్థ ( Handloom Export Promotion Council):

చేనేత ఎగుమతులు వృద్ధి చేసేందుకు స్థాపించిన ఈ కంపెనీ ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. దేశదేశాల మార్కెటింగ్ మరియు వ్యాపార సమాచారం; భారతీయ ఉత్పత్తుల గురించి ప్రచారం; కొనుగోలుదార్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం; చేనేత ఎగుమతిదార్లకు సలహాలు, సేవలు అందించడం; అంతర్జాతీయ వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేయడం; వాణిజ్య ఎగుమతులలో వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం; మార్కెట్లకు అనుగుణంగా చేనేత కళాకారులు ఉత్పత్తులు తయారు చేయడంలో, అధునాతన ఉత్పత్తులు డిజైన్ల తయారీలో మొదలైన విషయాలలో ఎగుమతి సంస్థలకు, చేనేత కార్మికులకు సందర్భానుసారం సలహాలు ఇచ్చి తోడ్పాటును అందిస్తోంది.

అయితే ఏ ప్రభుత్వ సంస్థలు ఎంత చేసినా ఇంత పెద్ద చేనేత కుటీర పారిశ్రామిక రంగం, సరియైన స్థాయిలో ప్రజల చేయూత, తోడ్పాటు, కొనుగోళ్ళు లేకపోతే సుస్థిరంగా నిలబడలేదు. ప్రతి భారతీయుడు, తాము కొనే వస్త్రాలలో, దుప్పట్లు, తువాళ్ళు, కర్టెన్లు, గలీబులు మొదలైన ప్రతిరోజు వాడే వస్తువుల్లో, కనీసం 15-20% చేనేత తయారీలు వాడగలిగితే, మన ప్రాచీన సాంస్కృతిక సంపద, వారసత్వం నిరంతరం జీవించగలుగుతుంది, చేనేత మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు మనుగడ సాగించగలుగుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • august 7
  • india
  • National Handloom Day

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • H1b Visa

    H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!

Latest News

  • Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు

  • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

Trending News

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd