National Couples Day : జంటలకు ఒక రోజు.. అలా మొదలైంది!
National Couples Day : ఇవాళ "జంటల దినోత్సవం".. దీన్ని "నేషనల్ కపుల్స్ డే" పేరుతో అమెరికాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఇది జంటలు పంచుకునే ప్రేమ, అనురాగాన్ని గౌరవించే రోజు.
- By Pasha Published Date - 12:30 PM, Fri - 18 August 23
National Couples Day : ఇవాళ “జంటల దినోత్సవం”.. దీన్ని “నేషనల్ కపుల్స్ డే” పేరుతో అమెరికాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు..
ఇది జంటలు పంచుకునే ప్రేమ, అనురాగాన్ని గౌరవించే రోజు.
2010 సంవత్సరం నుంచి జాతీయ జంటల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తొలుత అమెరికాలోని ఒక సంస్థ తన ఉత్పత్తులపై మార్కెట్లో ప్రచారం పెంచడానికి, వాటి సేల్స్ ను పెంచుకోవడానికి జంటల దినోత్సవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది.
Also read : Kohli – 15 Years – 10 Things : కోహ్లీ 15 ఏళ్ల క్రికెట్ జర్నీ.. 10 ఆసక్తికర విశేషాలు
జాతీయ జంటల దినోత్సవం రోజున పెళ్లయిన, పెళ్లికాని జంటలు అమెరికాలో వేడుకలు చేసుకుంటాయి. అయితే ఆసక్తి, తీరిక ఉన్నవారు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజున అమెరికాలో రెస్టారెంట్ లు జంటలతో కిక్కిరిసి ఉంటాయి. పార్క్లలోనూ కపుల్స్ సందడి కనిపిస్తుంది. ఈ రోజంతా షాపింగ్ సెంటర్స్ , గిఫ్ట్ సెంటర్స్ బిజీబిజీగా కళకళలాడుతాయి. కొన్ని జంటలు ఇంట్లో ఫ్యామిలీతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. వీకెండ్ కావడంతో మరికొందరు చిన్నపాటి విహారయాత్రలను కూడా(National Couples Day) ప్లాన్ చేసుకుంటారు. ఇంకొన్ని జంటలు మూవీ థియేటర్స్ కు క్యూ కడతాయి. లవ్ నేపథ్యం కలిగిన మూవీస్ ఈ టైంలో బాగానే కలెక్షన్స్ ను సాధిస్తాయి.
Also read : Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్
కొన్ని కోట్స్ ఇవిగో..
- “ప్రేమ అనేది కలిసి జీవించడానికి ఒకరిని కనుగొనడం కాదు.. మీరు లేకుండా జీవించడం ఊహించలేని వ్యక్తిని కనుగొనడం”
- “ప్రేమంటే మీరు ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కలిసి ఉన్నారనేది కాదు. ప్రతి రోజు ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారనేది ప్రేమ”
- “నీ చిరునవ్వులో, నేను నక్షత్రాల కంటే అందమైన దాన్ని చూస్తున్నాను” – బెత్ రివిస్
- “ఉత్తమ ప్రేమ అనేది ఆత్మను మేల్కొల్పుతుంది. మనల్ని మరింత చేరువ చేస్తుంది. మన మనస్సులకు శాంతిని ఇస్తుంది” – నికోలస్ స్పార్క్స్
Related News
KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు
KTR: బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచ