Giraffe vs Loin: పిల్ల జిరాఫీ పై సింహం దాడి.. తల్లి జిరాఫీ ని చూడగానే సింహం జంప్..
సింహంపై జిరాఫీ దాడి యత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చలో నిలిచింది . పిల్ల జిరాఫీ ఒంటరిగా ఉందనుకుని ఓ సింహం ఒక్కసారిగా దాడి చేసింది.
- Author : Maheswara Rao Nadella
Date : 13-03-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
సింహంపై జిరాఫీ (Giraffe) దాడి యత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చలో నిలిచింది . పిల్ల జిరాఫీ ఒంటరిగా ఉందనుకుని ఓ సింహం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ క్రమంలో పిల్ల జిరాఫీ (Giraffe) పీకపట్టుకోవడంతో అది తల వాల్చేసింది. అయితే..ఆ పక్కనే ఉన్న తల్లి జిరాఫీ ఒక్కసారిగా సింహంపై లంఘించుకోవడంతో బెదిరిపోయిన సింహం అక్కడి నుంచి పారిపోయింది. జిరాఫీ ధాటికి సింహం పారిపోవడం పలువురిని ఆకట్టుకోవడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
తన పిల్లను కాపాకునేందుకు ప్రాణాలకు తెగించిన తల్లి జిరాఫీ (Giraffe) నిజంగా గొప్పదంటూ కొందరు కామెంట్లు . ‘‘తల్లి ప్రేమ ఇదే అంటూ’’ అంటూ వరుస వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే సింహం దాడిలో తీవ్రంగా గాయపడ్డ పిల్ల జిరాఫీ వాల్చిన తలను ఎత్తకపోవడాన్ని కొందరు గుర్తించారు. అది అప్పటికే మరణం అంచుకు చేరుకుని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జీవితం అంటే ఇదేనా.. చంపడం లేదా చావడమేనా’’ అంటూ కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే.. ప్రకృతి వీడియోల పేరిట ఇలాంటి సున్నితమైన దృశ్యాలను షేర్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Also Read: Sunburn Tips: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.