Cafe Culture: సిటీ జనాలకు సూపర్ స్పాట్.. ట్రెండింగ్ కేఫ్!
సిటీ జనాలు వీకెండ్స్ రాగానే పలు ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు ఇష్టపడుతుంటారు.
- By Balu J Published Date - 06:02 PM, Tue - 18 July 23

హైదరాబాదీయులు వీకెండ్స్ రాగానే పలు ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు ఇష్టపడుతుంటారు. తమకు ఇష్టమైన ప్రదేశాలను తెలుసుకొని అక్కడికి వాలిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఫుడ్ లవర్స్ లో కేఫ్ కల్చర్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ సిటీలో కేఫ్ సంస్కృతి బాగా ప్రజాదరణ పొందుతోంది. స్థానికులు, పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశంగా మారుతుంది. దాదాపు ప్రతి వారం నగరంలో అనేక కేఫ్‌లు పుట్టుకొస్తుండటంతో హైదరాబాదీలకు ఇష్టమైన కాలక్షేపంగా మారింది. ఆహార ప్రియుల దృష్టిని వేగంగా ఆకర్షించే వాటిలో కేఫ్ కచ్చితంగా ఉంటుంది
FTV కేఫ్ (Fashiontv Cafe) అనేది హైదరాబాద్ శివార్లలో ఉన్న ట్రెండింగ్ కొత్త కేఫ్. ఇది ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పడటంతో కాఫీ ప్రియులు క్యూ కడుతున్నారు. కేఫ్ అవుట్‌డోర్ సీటింగ్ పచ్చదనంతో అలంకరించబడి ఉంటుంది. వర్షాకాలం, రాబోయే చలికాలంలో ఇది సరైన ప్రదేశం. కోకాపేట్ నుండి కేవలం 10 నిమిషాల ప్రయాణంలో శంకర్‌పల్లి రోడ్‌లో ఉన్న ఈ అధునాతన కేఫ్ ప్రజల హృదయాలను దోచుకుంది. పెంపుడు జంతువులకు అనుకూలమైన ప్రదేశం కూడా.