Karnataka: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం ఫ్రమ్ హోంకి అనుమతి లేదు
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారితో గెలుపొందింది. దీంతో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల వద్దకు పాలన మాదిరిగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు సీఎం.
- Author : Praveen Aluthuru
Date : 12-09-2023 - 3:48 IST
Published By : Hashtagu Telugu Desk
Karnataka: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారితో గెలుపొందింది. దీంతో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల వద్దకు పాలన మాదిరిగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు సీఎం. అయితే ఇటీవల ఆయనకు కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు పెద్దఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అనుమతించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జిల్లా కమీషనర్లు మరియు జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ “జిల్లా మరియు తాలూకా కేంద్రాలలో అధికారులు ఇంటి నుండి పని చేయకూడదు. ఇంటి నుండి పని చేయడం అనుమతించబడదు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అధికారులు ఫోన్ కాల్‌లకు స్పందించడం లేదని ప్రజలు, ఎమ్మెల్యేలు మరియు మంత్రుల నుండి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇది మంచిది కాదని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా సామాన్య ప్రజల నుంచి వచ్చే కాల్స్‌కు మీరు స్పందించాలి అని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా ప్రొటోకాల్‌ను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారానికోసారి బహిరంగ సభలు నిర్వహించాలని, వారి ఫిర్యాదులపై స్పందించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని డీసీలు, జిల్లా పంచాయతీ సీఈవోలకు సిద్ధరామయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు చిన్న చిన్న సమస్యలకు నా వద్దకు వస్తే మీరెందుకు అని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా జిల్లాలను సందర్శించాను, ఈ సమయంలో సాధారణ ప్రజలు వందలాది అభ్యర్థనలు చేశారు. జిల్లా, తాలూకా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలతో ప్రజలు నా వద్దకు వస్తున్నారు. అలా కాకుండా మీరు వాటికి తక్షణమే పరిష్కారాలు చూపి ఉంటే ఇలా జరిగేది కాదు అని అన్నారు. కొన్ని సమస్యలకు వారంలోగా పరిష్కారాలను అందించండి. సమస్య పరిష్కరించబడిందో లేదో మళ్లీ తనిఖీ చేయండి. అలాంటప్పుడు జనం నా దగ్గరకు రావలసిన అవసరం ఉండదని చెప్పారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.
Also Read: Chandrababu Arrest : Jr ఎన్టీఆర్ ఫై టీడీపీ శ్రేణుల ఆగ్రహం…!