Crypto Kingpin : రూ.8 లక్షల కోట్ల స్కాం.. అమెరికా వాంటెడ్.. కేరళలో దొరికాడు
ఆ ఆర్థిక మోసగాడి పేరు అలెక్సెజ్ బెస్కీయోకోవ్(Crypto Kingpin). ఇతడు లిథువేనియా దేశస్తుడు.
- By Pasha Published Date - 01:27 PM, Thu - 13 March 25

Crypto Kingpin : అతడు మామూలు క్రిమినల్ కాదు. అమెరికా వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో అతగాడి పేరుంది. ఏకంగా రూ.8 లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. ఈ కరుడుగట్టిన ఆర్థిక మోసగాన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. అతడిని పట్టుకుంది ఎవరో కాదు.. మన కేరళ పోలీసులే. వివరాలివీ..
Also Read :Rs 800 Coins : తొలిసారిగా రూ.800, రూ.900 నాణేలు.. విశేషాలివీ
ఈ స్కాం వివరాలివీ..
- ఆ ఆర్థిక మోసగాడి పేరు అలెక్సెజ్ బెస్కీయోకోవ్(Crypto Kingpin).
- ఇతడు లిథువేనియా దేశస్తుడు.
- ‘గారంటెక్స్’ పేరుతో కొన్నేళ్ల క్రితం క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశాడు. ఇది రష్యా కేంద్రంగా పనిచేసేది.
- ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీని వాడుకొని అలెక్సెజ్ మనీలాండరింగ్ మోసానికి పాల్పడ్డాడు. ఈ మోసం విలువ దాదాపు రూ.8 లక్షల కోట్ల దాకా ఉంటుందట.
- ఈ ఎక్స్ఛేంజీలో అంతర్జాతీయ నేర సంస్థలు, ఉగ్రవాద ముఠాలు కూడా భాగమైనట్లు గుర్తించారు.
- ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ విభాగం లాజరస్ గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ‘గారంటెక్స్’ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ సహాయ సహకారాలను అందించిందట.
- ‘గారంటెక్స్’ ఎక్స్ఛేంజీని వాడుకొని అలెక్సెజ్ భారీగా డబ్బులు సంపాదించాడు.
- ఆ డబ్బులతో కంప్యూటర్ హ్యాకింగ్, నార్కోటిక్స్ లావాదేవీలు, రాన్సమ్‌వేర్ వంటి మోసాలకు అలెక్సెజ్ పాల్పడ్డాడు.
- అమెరికా, రష్యాలలో అలెక్సెజ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి.
- 2022 ఏప్రిల్‌లో అలెక్సెజ్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అతడు పరారీలో ఉన్నాడు.
- ‘గారంటెక్స్’ ఎక్స్ఛేంజీకి సంబంధించిన రూ.243 కోట్లు విలువైన నిధులను గత వారంలో అమెరికా, జర్మనీ, ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రభుత్వ సంస్థలు స్తంభింపజేశాయి.
- అలెక్సెజ్ భారత్‌లో ఉన్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు, భారత విదేశాంగశాఖను సంప్రదించారు. అనంతరం ప్రొవిజినల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేశారు.
- సీబీఐ, కేరళ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి తిరువనంతపురంలో అలెక్సెజ్‌ను అరెస్టు చేశారు.
- భారత్‌ను వదిలి మరో దేశానికి పారిపోయేందుకు అలెక్సెజ్ రెడీ అవుతుండగా అదుపులోకి తీసుకున్నారు.
- పోలీసులు పట్టుకునే సమయానికి.. అలెక్సెజ్ వెంట అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నట్లు తెలిసింది.