Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
- By hashtagu Published Date - 05:35 PM, Mon - 10 January 22

సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. ఎవరైనా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది.