Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
- Author : Gopichand
Date : 30-11-2025 - 6:26 IST
Published By : Hashtagu Telugu Desk
Tamil Nadu: తమిళనాడులోని (Tamil Nadu) శివగంగ జిల్లా తిరుపత్తూర్ సమీపంలో ఆదివారం జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 8 మంది మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని శివగంగ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శివ ప్రసాద్ ధృవీకరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒక బస్సు కారైకుడికి వెళ్తుండగా మరొకటి మధురై వైపు వెళ్తోంది. ఈ సమయంలో తిరుపత్తూర్ సమీపంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు బస్సుల లోపల చిక్కుకుపోయారు. వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.
Also Read: Commonwealth Games : కామన్వెల్త్ గేమ్స్ ఖర్చు అంచనా ఎంతంటే?
పోలీసుల సమాచారం ప్రకారం.. ఢీకొన్న తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, రెండు బస్సుల ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన వారిని శివగంగ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నివేదికల ప్రకారం.. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత్యవసర బృందాలు ఇంకా ప్రమాద స్థలంలోనే మోహరించి ఉన్నాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.