Udayanidhi Stalin : తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కు మంత్రి పదవి..!
- Author : Vamsi Chowdary Korata
Date : 12-12-2022 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) మంత్రి పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన తన తండ్రి, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రి అవుతాడన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు.
ఇక తనకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలపై ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) స్పందించారు. ఈ వార్తలను ఆయన ధ్రువీకరించలేదు. అదే సమయంలో ఖండించనూలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, దానిపై తాను వ్యాఖ్యానించలేను అని చెప్పారు.
అయితే, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని డీఎంకేలోని ప్రముఖ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జరగనున్న సీఎం స్టాలిన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉదయనిధికి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఇవ్వనున్నట్లు తెలిపాయి. మెయ్యనాథన్ శివ ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్లో మార్పుల తర్వాత పలువురు మంత్రుల శాఖలు మారనున్నాయి.
Also Read: Hyderabad City Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లు జనాలతో కిటకిట…