HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Shock For Mamata Another Tmc Rajya Sabha Mp Resigns

TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2026 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shock for Mamata: Another TMC Rajya Sabha MP resigns.
Shock for Mamata: Another TMC Rajya Sabha MP resigns.

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి సెగలు ఇప్పుడు ఢిల్లీకి పాకాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ వారంలోనే టీఎంసీ నుంచి వైదొలగిన రెండో రాజ్యసభ సభ్యురాలు ఈమె కావడం గమనార్హం.

రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపిన తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని సుస్మితా దేవ్ కోరారు. రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఆమె ఢిల్లీలో అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మతో ఆయన నివాసంలో నవ్వుతూ కనిపించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కలయిక వెనుక ఉన్న కారణాలపై విలేకరులు ప్రశ్నించగా, “ఇది కేవలం అసోం కనెక్షన్ మాత్రమే” అంటూ ఆమె సమాధానం దాటవేశారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది.

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సుస్మితా దేవ్, 2021లో టీఎంసీలో చేరారు. ఈమె అసోంకు చెందిన కాంగ్రెస్ దిగ్గజం సంత్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, సిల్చార్ నుంచి ఎంపీగా పనిచేశారు.

ఇదే వారంలో సోమవారం నాడు, టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో పార్టీ ఓటమిని, ప్రజాతీర్పును గౌరవిస్తూ తాను వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఈ వరుస రాజీనామాలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే, 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి, ప్రతిపక్ష నేత పదవికి అధికారిక అభ్యర్థిని కాదని వేరే వ్యక్తికి మద్దతు పలికారు. స్పీకర్ కూడా వారి నిర్ణయాన్నే మద్దతు తెలపడంతో పార్టీలోని లోతైన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు ఈ అసమ్మతి సెగ జాతీయ స్థాయికి పాకడంతో టీఎంసీ అధిష్టానం తీవ్ర ఆందోళనలో పడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Himanta Biswa Sarma
  • MP Sushmita Dev
  • TMC Rajya Sabha MP Resignation
  • Trinamool Congress
  • West Bengal Politics

Related News

Mamata Banerjee

Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) మంగళవారం (జూన్ 9, 2026) నాడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి (30B, హరీష్ ఛటర్జీ వీధి) చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని CID అధికారులు భావించారు. ఆ చిరునామా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేర్కొన

    Latest News

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

    • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

    • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd