Rajinikanth Yoga:ఆ మూలికల్లో వారం రోజులకు సరిపడా శక్తి ఉంటుంది: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్...భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఎంతో గొప్ప నటుడు. అయినప్పటికీ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు.
- Author : hashtagu
Date : 24-07-2022 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ రజనీకాంత్…భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఎంతో గొప్ప నటుడు. అయినప్పటికీ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు. రజనీకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అందుకే తరచుగా హిమాలయాలకు వెళ్తుంటారు. తాజాగా చెన్నైలో ఓ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
హిమాలయాలు అంటే చాలామంది మామూలు మంచు కొండలు అనుకుంటారు. కానీ అవి అద్భుతమైన వన మూలికలు ఉన్న పర్వతాలు. అక్కడ లభించే కొన్ని మూలికలు తింటే వారం రోజులకు సరిపడే శక్తి లభిస్తుందని తెలిపారు. మానవ జీవితంలో ఆరోగ్యానిదే ప్రముఖస్థానమని రజనీకాంత్ స్పష్టం చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనవాళ్లు సంతోషంగా ఉంటారన్నారు. మనం ఆనారోగ్యంతో ఉంటే మనకు కావాల్సిన వాళ్లు ఆనందంగా ఉండలేరని వివరించారు రజనీకాంత్ .