Preity Zinta Loan : ‘‘ప్రీతీ జింతాకు రుణమాఫీ’’.. కాంగ్రెస్ ఆరోపణ.. హీరోయిన్ రియాక్షన్
అయితే ప్రీతిపై(Preity Zinta Loan) సంచలన ఆరోపణలు చేస్తూ ఇటీవలే కేరళ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది.
- By Pasha Published Date - 02:00 PM, Tue - 25 February 25

Preity Zinta Loan : కాంగ్రెస్ పార్టీపై ప్రీతీ జింతా ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. అసలు విషయం తెలుసుకోకుండా తన ఆర్థిక స్థితిగతులపై ఎలా మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు. వివరాలివీ..
Also Read :Mysterious Hair Loss: గోధుమల దెబ్బకు జుట్టు రాలుతోంది.. ఆ జిల్లాలో కలకలం
రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేశారంటూ..
ప్రీతీ జింతా గురించి మనకు బాగా తెలుసు. ఆమె బాలీవుడ్ ప్రముఖ నటీమణుల్లో ఒకరు. ఐపీఎల్‌లో పంజాబ్ టీమ్ సహ యజమానిగా ప్రీతి వ్యవహరిస్తున్నారు. అయితే ప్రీతిపై(Preity Zinta Loan) సంచలన ఆరోపణలు చేస్తూ ఇటీవలే కేరళ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. ‘‘నటి ప్రీతీ జింతా తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారు’’ అని ఆ పోస్ట్‌లో కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
No I operate my social media accounts my self and shame on you for promoting FAKE NEWS ! No one wrote off anything or any loan for me. I’m shocked that a political party or their representative is promoting fake news & indulging in vile gossip & click baits using my name &… https://t.co/cdnEvqnkYx
— Preity G Zinta (@realpreityzinta) February 25, 2025
Also Read :Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ
కేరళ కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ పోస్ట్‌కు ఈరోజు (ఫిబ్రవరి 25న) ఉదయం ప్రీతీ జింతా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నా సోషల్ మీడియా అకౌంట్లను నేను నిర్వహించుకుంటున్నాను. వాటిని ఎవ్వరికీ అప్పగించలేదు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకొన్న రుణాన్ని నేను పదేళ్ల కిందటే తీర్చేశాను. కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్‌ను చూసి ఆశ్చర్యపోయాను. నాకోసం ఎవరూ.. ఏ రుణాన్నీ మాఫీ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ నా పేరును ఉపయోగించి తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేస్తుంది? అసలు విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఎటువంటి అపార్థాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఆ పార్టీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నాను’’ అని పేర్కొంటూ ప్రీతీ జింతా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. బ్యాంకు నుంచి రూ.122 కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రీతీ జింతాపై కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఆరోపణలు చేయడం గమనార్హం.