Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ
శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను(Samsung Tri Fold Phone) ఈ ఏడాది జులైలో విడుదల చేసే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 11:56 AM, Tue - 25 February 25

Samsung Tri Fold Phone: స్మార్ట్‌ఫోన్ల విభాగంలో శాంసంగ్ రారాజుగా వెలుగొందుతోంది. కొత్తకొత్త ఆవిష్కరణల్లో చైనా కంపెనీ హువావే ముందంజలో ఉంది. అయితే ప్రజలకు అందుబాటు రేట్లలో కొత్త ప్రోడక్ట్స్‌ను అందిస్తున్నది మాత్రం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఒక్కటే. త్వరలోనే శాంసంగ్ నుంచి మనకు మరో ప్రోడక్ట్ అందనుంది. అదే.. ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్. అంటే ఇందులో మూడు మడతలు ఉంటాయి. ఈ ఫోన్ ఎప్పటివరకు వస్తుంది ? ధర ఎంత ? ఫీచర్లు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం..
Also Read :Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు
శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విశేషాలు
- శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను(Samsung Tri Fold Phone) ఈ ఏడాది జులైలో విడుదల చేసే అవకాశం ఉంది.
- ఈ ఫోన్‌కు గెలాక్సీ జీ ఫోల్డ్ (Galaxy G Fold) అని పేరు పెట్టే ఛాన్స్ ఉంది.
- ఈ ఫోన్ నమూనాను తొలిసారిగా 2023 అక్టోబరులో జరిగిన శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు.
- తొలి విడతగా కొన్ని ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లనే మార్కెట్‌లోకి విడుదల చేయాలని శాంసంగ్ కంపెనీ భావిస్తోంది.
- ఈ ఫోన్ ధర భారతదేశ మార్కెట్లో రూ.1.20 లక్షలకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- రెండు వైపులా ఫోల్డ్ చేయగలిగేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.
- ఇందులో 9.96 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని హైట్ 654 అంగుళాలు.
- ఈ ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే కెమెరా ఉండదని అంటున్నారు. దీనికి బదులుగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందట.
Also Read :BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?
- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6’ ఫోన్ తరహాలోనే ట్రై ఫోల్డ్ ఫోన్‌లోనూ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఉంటుందట. 2600 నిట్ల సామర్థ్యంతో బ్రైట్‌నెస్ ఉంటుంది.
- ట్రై ఫోల్డ్ ఫోన్‌కు చెందిన వైర్డ్ ఛార్జింగ్ వేగం దాదాపు 25 వాట్లు ఉంటుందట.
- ఈ ఫోన్‌ను.. స్మార్ట్ ఫోన్‌గా, ట్యాబ్‌గా ఎలాగైనా మన అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆ విధంగా మడత పెట్టేయొచ్చు.
- ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను 2024 సెప్టెంబరులో చైనా కంపెనీ హువావే విడుదల చేసింది. దానికి ‘మేట్ ఎక్స్‌టీ’ (Mate XT) అని పేరు పెట్టింది.