DK Shivakumar: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. సీఎం పదవి కోసమేనా?
డీకే ఈ కుర్చీ సంబంధిత వ్యాఖ్య ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య అధికార పోరాటం గురించిన ఊహాగానాలకు ఊతం ఇచ్చింది. అయితే, సిద్ధరామయ్య ఇప్పటికే నాయకత్వ మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
- By Gopichand Published Date - 11:51 AM, Sat - 12 July 25

DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో రాజకీయ వర్గాల్లో ముఖ్యమంత్రి పదవి గురించి చర్చలు మొదలయ్యాయి. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. “మనమందరం కుర్చీ కోసం పోరాడుతున్నాం. ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. రండి, కూర్చోండి. కుర్చీ దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు కూర్చోవాలి” అని అన్నారు. డిప్యూటీ సీఎం శివకుమార్ ఈ వ్యాఖ్యలను బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో బెంగళూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కెంపెగౌడ జయంతి కార్యక్రమంలో చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవి పట్ల తన ఆకాంక్షను మరోసారి స్పష్టం చేశాయి.
సీఎం పదవి గురించి కాంగ్రెస్‌లో ఆంతరంగిక విభేదాలు
డీకే ఈ కుర్చీ సంబంధిత వ్యాఖ్య ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య అధికార పోరాటం గురించిన ఊహాగానాలకు ఊతం ఇచ్చింది. అయితే, సిద్ధరామయ్య ఇప్పటికే నాయకత్వ మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కానీ శివకుమార్ వ్యాఖ్యల నుండి కాంగ్రెస్‌లో అగ్రస్థానం పదవి గురించి ఆంతరంగిక విభేదాలు ఇంకా ఆగలేదని స్పష్టమవుతోంది.
Also Read: X Prices: ఎక్స్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ప్రీమియం ప్లాన్ ధరలు!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హోదా ఏమిటి?
సిద్ధరామయ్య గత గురువారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పూర్తి కాలం పనిచేస్తుందని, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారు. ఇది హైకమాండ్ నిర్ణయమని, దీనిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. పార్టీలో గుట్టుగుట్టుగా వార్తలు హెడ్‌లైన్స్‌లో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్య వచ్చింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం కర్ణాటకలో నాయకత్వ మార్పు మూడ్‌లో లేదని తెలుస్తోంది.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ప్రకారం.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి గురించి ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. “ఇదే నా సమాధానం” అని స్పష్టం చేశారు. అలాగే డీకే శివకుమార్‌ను ఉటంకిస్తూ సీఎం పదవి ఖాళీగా లేదని శివకుమార్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ఇద్దరు నాయకులు హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా పాటిస్తామని పునరుద్ఘాటించారు.