HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Modi To Hold Talks With Chief Ministers Of Four States On Polavaram Project

Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్‌ మాజీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 02:09 PM, Sat - 17 May 25
  • daily-hunt
Polavaram Reviewed By Narendra Modi
Polavaram Reviewed By Narendra Modi

Polavaram Project : రాష్ట్ర జీవన రేఖగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టుకు తిరిగి మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సమీక్ష నిర్వహించడం విశేషంగా మారింది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఒడిశా సీఎం మోహన్‌ మాజీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి, ఆయా రాష్ట్రాల జలవనరుల మంత్రులు, ముఖ్య అధికారులు హాజరవుతారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు ఇప్పటికే పంపింది.

జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు – నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే

రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించగా, కేంద్ర జలశక్తి శాఖ కూడా అనుకూలంగా స్పందించింది. 2014 నుండి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రతి సోమవారం “పోలవరంగా” రివ్యూలు నిర్వహిస్తూ ప్రధాన డ్యాం పనులను 72% వరకు పూర్తి చేయించారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తై, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం వేసే దశకు వచ్చింది.

జగన్ పాలనలో స్థంభించిన పురోగతి

2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, పోలవరం పనులు అప్రాధాన్యతకు గురయ్యాయి. అప్పటి దాకా కొనసాగుతున్న కాంట్రాక్టును రద్దు చేయడంతో, సుమారు ఒక సంవత్సరం పాటు పనులు నిలిచిపోయాయి. 2020లో గోదావరిలో వచ్చిన భారీ వరదలతో డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం మూలంగా ప్రధాన డ్యాం పనులు పూర్తిగా ఆగిపోయాయి.

చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో జోరు

2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టుకు జీవం వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచనల మేరకు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు కూడా ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 2027 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమీక్ష జరుపుతుండటం కీలక ఘట్టంగా మారింది.

ముంపు అంశంపై స్పందనకు ఆసక్తి

ఈ సమీక్షలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ముంపు సమస్య పై ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తతాయా? ఒకవేళ లేవనెత్తితే వాటిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో సయోధ్యకు ప్రధాని పాలుపంచుకుంటారన్న ఆశాభావం రాష్ట్ర జలవనరుల శాఖలో ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • CM Mohan Majhi
  • CM Revanth Reddy
  • CM Vishnu Deo Sai
  • Narendra Modi Review Meeting On Polavaram
  • polavaram project

Related News

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • CM Revanth Reddy offers special prayers to Khairatabad Bada Ganesh

    Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

Latest News

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd