HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Karnataka New Cm Dk Shiva Kumar

Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Author : Prasad Date : 30-05-2026 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dk Shiva Kumar
Dk Shiva Kumar

రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) శనివారం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు బ‌లంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించి మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో అధికారికంగా నాయకత్వ మార్పుకు మార్గం సుగమమైంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు సిద్దరామయ్య కొనసాగుతారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్న సీఎల్పీ సమావేశంలో ముందుగా సిద్దరామయ్య సేవలను ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదించి, అనంతరం డీకే శివకుమార్‌ను కొత్త శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హాజరుకానున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేలతో సిద్దరామయ్య, శివకుమార్ విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం ఇద్దరూ బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా.. డీకే శివకుమార్ ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై అనధికారికంగా సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని పలువురు ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పార్టీ వర్గాలు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, వచ్చే వారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తొలి దశలో 5 నుంచి 10 మంది మంత్రులతో చిన్న మంత్రివర్గం ఏర్పడి, అనంతరం విస్తరణ చేపట్టే అవకాశముందని స‌మాచారం.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మే 31, జూన్ 1 లేదా జూన్ 5 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమానికి హాజరయ్యే కాంగ్రెస్ సీనియర్ నేతల అందుబాటు ఆధారంగా తుది తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమతుల్యత కోసం ఓబీసీ, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన నేతకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిద్దరామయ్య రాజీనామా అనంతరం స్పందించిన శివకుమార్.. ఆయ‌న‌ను పార్టీకి బ‌ల‌మైన పునాది అంటూ కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన మార్గదర్శకత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు అనుకున్నట్లే జరిగితే కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పు చోటుచేసుకున్న రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • CM karnataka
  • CM Sidda Ramaiah
  • congress
  • Deputy CM DK Shivakumar

Related News

Tbjp Chief Ramchandar Rao

BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చంద్ర‌రావు విమర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చింద‌ని ఆయ‌న ఆరోపి

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Siddaramaiah

    Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

  • siddaramaiah-and-dk-shivakumar

    Karnataka : క‌ర్ణాట‌క సీఎం సిద్దరామయ్య రాజీనామా ఆమోదం.. ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్‌

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd