Google Maps: ఇద్దరి వైద్యుల ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్.. అసలేం జరిగిందంటే..?
టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే అది మీ ప్రాణాలను కూడా తీయగలదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) తప్పుదారి పట్టించడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంటుంది.
- Author : Gopichand
Date : 02-10-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Google Maps: టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే అది మీ ప్రాణాలను కూడా తీయగలదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) తప్పుదారి పట్టించడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంటుంది. వాస్తవానికి కొచ్చి సమీపంలోని గోతురుత్‌లోని పెరియార్ నదిలో కొందరు ప్రయాణిస్తున్న కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించారు. గూగుల్ మ్యాప్స్ మరణానికి కారణమైంది. కారులో ఉన్న వ్యక్తులు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు వెళుతుండగా, వారి కారు అదుపుతప్పి కాలువలో పడి ఇద్దరు మరణించారు.
పిటిఐ ఏజెన్సీ ప్రకారం.. కేరళలోని కొచ్చి సమీపంలో పెరియార్ నదిలో కారు పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వైద్యులు శనివారం అర్థరాత్రి మరణించారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులను అద్వైత్ (29), అజ్మల్ (29)గా గుర్తించారు. శనివారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Also Read: Table Tennis – Bronze Medal : టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో ఇండియాకు కాంస్యం
We’re now on WhatsApp. Click to Join
ఈ ప్రమాదంలో వైద్యులతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరించి నదికి చేరుకున్నాడని, అయితే అతను రోడ్డుపైకి వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఆ సమయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉందని.. గూగుల్ మ్యాప్స్ చూపిన రూట్‌లో వెళ్తున్నారని, అయితే మ్యాప్‌లో చూపిన ఎడమ మలుపు కాకుండా పొరపాటున ముందుకు వెళ్లి నదిలో పడినట్లు క్షతగాత్రులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వచ్చి వారిని కాపాడి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వైద్యుల మృతదేహాలను వెలికితీసేందుకు డైవర్ల బృందాన్ని రంగంలోకి దించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.