Table Tennis – Bronze Medal : టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో ఇండియాకు కాంస్యం
Table Tennis - Bronze Medal : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట పండుతోంది.
- By Pasha Published Date - 12:37 PM, Mon - 2 October 23

Table Tennis – Bronze Medal : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట పండుతోంది. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ డబుల్ విభాగంలో ఆహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ కాంస్య పతకం సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. ఇవాళ ఉదయం హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ కొరియాకు చెందిన సుయోంగ్ చా, సుగ్యోంగ్ పాక్ టీమ్ తో ఆహికా- సుతీర్థ జోడీ పోరాడి ఓడింది. 60 నిమిషాల పాటు జరిగిన ఈమ్యాచ్ లో మొత్తం ఏడు రౌండ్లకుగానూ 2, 4, 5, 7 రౌండ్లలో దక్షిణ కొరియా టీమ్ పైచేయి సాధించింది. మొదటిరౌండ్, మూడో రౌండ్, ఆరో రౌండ్ లో భారత జోడీ సత్తా చాటింది.
We’re now on WhatsApp. Click to Join
ఆసియా గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను మాత్రమే సాధించింది. మునుపటి రెండు పతకాలు జకార్తాలో 2018లో జరిగిన ఆసియా గేమ్స్ లో వచ్చాయి. రోలర్ స్కేటింగ్ టీమ్ ఈవెంట్ లో పురుషుల టీమ్, మహిళల టీమ్ పతకాలను సాధించాయి. ఉమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల విభాగంలో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీటర్ల రిలే టీమ్ ఈవెంట్లో ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కాంస్యం (Table Tennis – Bronze Medal) గెలుపొందారు.