HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Free Bus Ride For Women In Karnataka From Today

Free Bus Ride : మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు షురూ

Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 

  • Author : Pasha Date : 11-06-2023 - 2:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Bus Ride
Free Bus Ride

Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..

ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.. 

రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. “శక్తి” పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సేవను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను అమల్లోకి తెచ్చింది. ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం 1 గంటల నుంచే కర్ణాటకలో మహిళలు ఫ్రీగా బస్సు సర్వీసులు (Free Bus Ride) వాడుకుంటున్నారు.  ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, విద్యార్థినులు ఉచితంగా ప్రయాణించే పథకాన్నికర్ణాటక విధాన సౌధ వద్దనున్న బస్టాప్ లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. శక్తి పథకం లోగోను ఆవిష్కరించి.. ఐదుగురు మహిళలకు లాంఛనంగా శక్తి స్మార్ట్‌కార్డులను అందించారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు తమ జిల్లాల్లో ప్రారంభించాలని, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.

Also read : TSRTC: మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్!

మహిళలు ‘సేవా సింధు’ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్మార్ట్ కార్డ్‌లు జారీ అయ్యే వరకు భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్యాలయాలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును చూపించి సున్నా విలువ టిక్కెట్‌ను మహిళలు పొందొచ్చు.  ఈ హామీని అమలు చేయడం వల్ల ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 41.8 లక్షల మంది మహిళా ప్రయాణికులు లబ్దిపొందుతారు. దీనివల్ల రాష్ట్ర  సర్కారు ఖజానాకు సంవత్సరానికి రూ.  4,051.56 కోట్ల ఖర్చు వస్తుంది. కర్ణాటక  ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లలో (KSRTC, BMTC, NWKRTC, KKRTC) 18,609 బస్సులు ఉన్నాయి. వీటన్నింటిలో మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు.

Also read : Self Driving Bus : సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు వస్తున్నాయహో.. ఎప్పుడంటే ?

ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన మిగితా 4 హామీలలో.. అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి), ప్రతి కుటుంబానికి చెందిన మహిళ పెద్దలకు రూ. 2,000 నెలవారీ సహాయం (గృహ లక్ష్మి), పేద కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం (అన్న భాగ్య), నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు ప్రతి నెల రూ.  3,000 , నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు నెలకు రూ. 1,500 (యువనిధి) ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assembly elections
  • congress
  • five guarantees
  • Free Bus Ride
  • Free Bus Ride For Women
  • free travel service
  • karnataka

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd