TSRTC: మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్!
టీఎస్ఆర్టీసీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- Author : Balu J
Date : 09-05-2023 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
లాభాలే ధ్యేయంగా టీఎస్ ఆర్టీసీ (TSRTC) ముందుకు సాగుతోంది. ఆర్టీసీ పరిరక్షణ కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతుంది. ఈ నేపథ్యంలో మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ (Hyderabad) పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు T24 టికెట్ రేట్లలో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణించే మహిళలకు (Women) T24 టికెట్‌ను కేవలం రూ.80కే అందిస్తుంది.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80లకు విక్రయిస్తుండగా.. తాజాగా మహిళలకు కూడా రూ.10 తగ్గించి రూ.80కే ఇస్తుంది. ఈ కొత్త T24 టికెట్ (Tickets) ధర ఈ నెల 9 వ తేది నుంచే తేదీ అమలులోకి రానుంది. హైదరాబాద్ లో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుక్కొని 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.
Also Read: MI vs RCB: నేడు బెంగళూరు, ముంబై జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!