Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
- By Balu J Published Date - 05:29 PM, Fri - 10 November 23

Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్‌ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్‌ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు.
శ్రీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం కనీసం 10 మంది భక్తులు స్పృహతప్పి పడిపోయారని, వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. భారతీయ సాంప్రదాయక మాసమైన కార్తీక మాసం పవిత్రంగా పరిగణించబడుతుంది. జగన్నాథునికి నమస్కరించడానికి 12వ శతాబ్దపు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Related News

Muslim MLA: ముస్లిం ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించిందని గంగాజలంతో శుద్ధి
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యే సందర్శించిన తర్వాత ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దూమరియాగంజ్ ఎమ్మెల్యే సయీదా ఖాతూన్