DK Shivakumar: RCB అందరి హృదయాలను గెలుచుకుంది.. DK ట్వీట్ వైరల్!
డీకే శివకుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు.
- By Balu J Published Date - 03:47 PM, Mon - 22 May 23

ఐపీఎల్ లో ఫ్లే ఆఫ్ రేసులో భాగంగా గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆర్సీబీ జట్టు ఓడినా కోహ్లీ అటతీరుకు ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంకు వెళ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు.
అతను బిజీ రాజకీయాల నుండి విరామం తీసుకొని మ్యాచ్ ను చూశాడు. కోహ్లీ ఆటతీరుకు ముగ్ధుడయ్యాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై RCB మ్యాచ్ ఓడింది. దీంతో డీకే శివకుమార్ రియాక్ట్ అవుతూ.. ఓడినా ఆర్సీబీ అభిమానులను మనసులను గెలుచుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌ని వీక్షించిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ‘ఆర్‌సీబీ హృదయాలను గెలుచుకుంది’ అంటూ స్పందించారు.
అతను చిన్నస్వామి స్టేడియం నుండి లైవ్ మ్యాచ్ ఫొటోలను ట్వీట్ చేసాడు, “బిజీ రాజకీయ కార్యకలాపాల తర్వాత, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని వీక్షించారు. ‘‘మా అబ్బాయిలు ఈసారి ఓడిపోయి ఉండవచ్చు, కానీ వారు అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఏది ఏమైనా నాకు ఇష్టమైనది RCB. కప్పు మనది అయ్యే సమయం వస్తుంది. నిరాశ చెందకండి, ఆశావాదంగా ఉండండి’’ అంటూ మ్యాచ్ ను ఉద్దేశించి మాట్లాడారు.
ಬಿಡುವಿಲ್ಲದ ರಾಜಕೀಯ ಚಟುವಟಿಕೆಗಳ ನಂತರ
ಬೆಂಗಳೂರಿನ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ನಡೆದ RCB ಹಾಗೂ ಗುಜರಾತ್ ಟೈಟಾನ್ಸ್ ನಡುವಿನ ರೋಚಕ #IPL ಪಂದ್ಯ ವೀಕ್ಷಿಸಿದೆ.ನಮ್ಮ ಹುಡುಗರು ಈ ಸಾರಿ ಸೋತಿರಬಹುದು, ಆದರೆ ಅತ್ಯುತ್ತಮ ಆಟದಿಂದ ಎಲ್ಲರ ಹೃದಯ ಗೆದ್ದಿದ್ದಾರೆ.
ಏನೇ ಆದ್ರು ನನ್ನ ಫೇವರಿಟ್ #RCB
ಕಪ್ ನಮ್ಮದಾಗುವ ಸಮಯ ಬಂದೇ… pic.twitter.com/WvqzXCLhdH— DK Shivakumar (@DKShivakumar) May 22, 2023
Also Read: Sarath Babu: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు శరత్ బాబు మృతి!
Related News

MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్
ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి . మైదానంలో నిశ్శబ్దం. జడేజా చేతిలో బ్యాట్ మరియు మోహిత్ శర్మ బౌలింగ్. చెన్నై, గుజరాత్ ఆటగాళ్లలో టెన్షన్