Hidimba Telugu Movie Review : అశ్విన్ డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా ?
- By Maheswara Rao Nadella Published Date - 02:45 PM, Thu - 20 July 23

Ashwin Babu Hidimba Movie Review :
ఫస్ట్ హాఫ్ స్లో అనిపించినా సెకండ్ హాఫ్ & ఫ్రీ క్లైమాక్స్ బాగుంది.
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా నచ్చుతుంది.
కథేంటంటే..
హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను హైదరాబాద్‌కు రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్ (అశ్విన్ బాబు) తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ (రాజీవ్ పిళ్ళై) అనే రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు (Hidimba) సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే అసలు కథ.
ఎవరెలా చేశారంటే..
పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో అందరిని మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా వేరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
నటీనటులు : అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు
నిర్మాత : గంగపట్నం శ్రీధర్
సమర్పణ : అనిల్ సుంకర
దర్శకత్వం : అనిల్ కన్నెగంటి
విడుదల తేది : జులై 20, 2023
Also Read: Treadmill Shocked: ట్రెడ్‌మిల్ పై జిమ్ చేస్తుండగా షాక్.. అక్కడికక్కడే యువకుడు మృతి!