Dog Lifestyle : కుక్కలకు విలాసవంతమైన జీవితం…షాంపైన్ కోసం ఓ మహిళ లక్షల్లో ఖర్చు..!!
- By hashtagu Published Date - 07:49 AM, Sun - 30 October 22
శునకం విశ్వసానికి మరోపేరు. రక్షణగా నిలిచే ఆయుధాలు కూడా. అందుకే వీటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది జంతుప్రేమికులు ఇష్టపడుతుంటారు. అంతేకాదు వాటికోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ జాతికి చెందిన శునకాలకు భలే క్రేజ్ ఉంటుంది. అయితే ఓ మోడల్ తన శునకం గ్రూమింగ్ కోసం 8లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతోంది. దానికి బ్రాండెండ్ దుస్తువులు, క్యారియర్ కు రెండు లక్షలు, ప్రతివారం స్నానం చేయించడం, గోళ్లు తీయడం, జుట్టు కత్తిరించడం కోసం పదివేలు ఖర్చు చేస్తుందట. శునకానికి చాలా ఖరీదైన షాపింగ్ చేసి వార్తల్లో నిలిచింది ఈ మోడల్. తన పెంపుడు కుక్క అందంగా కనిపించాలని లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందట. ప్రతిరోజూ దానికి షాంపైన్ తాగిస్తుందట. ఇలా తన కుక్కకు భారీగా ఖర్చు పెట్టి అందంగా తయారు చేయడం చాలా గర్వంగా ఉందని చెబుతోంది.
జు ఇసెన్ జోనాస్ ఈమె సోషల్ మీడియా ఇన్ ఫ్ల్లయెన్సర్. బ్రెజిల్ నివాసి. శునక ప్రేమికురాలు. ఆమె పెంపుడు కుక్క పేరు ఫ్రాన్సిస్కో. దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. తన కుక్క కోసం చేసిన షాపింగ్ కు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమెకు ఇన్ స్టాలో 1.5మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన శునకానికి ఆల్కహాల్ లేని షాంపైన్ , చేపలు, గుడ్లు రోజు ఆహారంగా పెడుతుంది. గూచీ కంపెనీ నుంచి కుక్క కోసం 52వేలు ఖరీదు చేసే కోటును కొనుగోలు చేసింది. కుక్కను మోసుకెళ్లే లూయిస్ మిట్టన్ కంపెనీకి చెందిన డాగ్ క్యారియర్ 2లక్షలు. అది తినే గిన్నె ఖరీదు 80వేలు.
ప్రతి విషయాన్ని నిస్వార్థంగా చేసేందుకు ప్రయత్నిస్తానని ఇసెన్ అంటున్నారు.ఇలా చేయడం ద్వారా మెరుగైన జీవనశైలిని పొందవచ్చని చెబుతోంది. అయితే ఇసెన్ అభిమానులు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కుక్క కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే తన ఫీలింగ్స్ ప్రజలు అర్థం చేసుకోరని లైట్ తీసుకుంది ఇసైన్. ఇతరు చెప్పే మాటలు నమ్మనని తనకు నచ్చింది చేస్తానని చెబుతోంది.