premium cot : నులక మంచం @ రూ. 1.12 లక్షలు .. ఎందుకంటే ?
నులక మంచం (premium cot) గురించి మన ఇండియన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. గ్రామీణ నేపథ్యం కలిగిన వారందరికీ అవి సుపరిచితం. వాటి ధర వేలల్లో ఉండటమే ఎక్కువ .. అలాంటిది వాటిని లక్షలు పెట్టి కొంటున్నారట !!
- By pasha Published Date - 03:07 PM, Fri - 12 May 23

నులక మంచం (premium cot) గురించి మన ఇండియన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. గ్రామీణ నేపథ్యం కలిగిన వారందరికీ అవి సుపరిచితం. వాటి ధర వేలల్లో ఉండటమే ఎక్కువ .. అలాంటిది వాటిని లక్షలు పెట్టి కొంటున్నారట !! మన ఇండియాలో మాత్రం కాదండోయ్ !! అమెరికాలో ఇప్పుడు నులక మంచాలకు తెగ గిరాకీ ఉందట!! అందుకే అమెరికాకు చెందిన “ఎట్సీ” (Etsy) అనే ఈ-కామర్స్ సంస్థ తన ఆన్ లైన్ స్టోర్ లో నులక మంచానికి రూ. 1.12 లక్షల రేటును పెట్టింది. అందంగా అలంకరించిన భారతీయ సాంప్రదాయ మంచం అని దాని గురించి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో చక్కగా వివరించారు. మంచం పొడవు 72అంగుళాలు, అడ్డం 36అంగుళాలని ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఇంకా 4 మాత్రమే స్టాక్ లో ఉన్నాయని “ఎట్సీ” ఈ-కామర్స్ పోర్టల్ పేర్కొంది . ఇప్పటివరకు “ఎట్సీ” ఈ రేటుకు 82 నులక మంచాలు అమ్మిందని సమాచారం.
also read : Govt E Commerce: ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు పోటీ!
రంగులను బట్టి రేట్లలో తేడా..
ఎట్సీ వెబ్ సైట్ లో వివిధ రకాల మంచాలు దొరుకుతున్నాయి. కొన్ని మంచాలు నవారుతో ఉంటే.. మరికొన్ని తాళ్ళతో చేసినవి ఉన్నాయి. ఈ బెడ్స్ అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. కలర్‌ఫుల్ నులక మంచం (premium cot) కావాలనుకుంటే ధర రూ.1.5 లక్షల దాకా ఉంది. సాధారణ రూపాన్ని కలిగి ఉన్న బెడ్ (premium cot) ధర రూ. 1,12,075 లక్షలు. ఒక వినియోగదారుడు Etsy వెబ్‌సైట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది వైరల్ అయ్యింది. ఈ మంచాలు మన ఇండియాలోని ఒక చిన్న వ్యాపారి నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని తెలిసింది. ఆ మంచం చెక్క, జనపనార తాడుతో తయారవుతుంది.

Related News

Rahul in US: అమెరికాలో సెంగోల్ పై రాహుల్ గళం
సెంగోల్ గురించి మాట్లాడుతూ కోపం మరియు ద్వేషం వంటి సమస్యలను ప్రధాని మోదీ అతని ప్రభుత్వం పరిష్కరించలేవని రాహుల్ గాంధీ(Rahul in US) అన్నారు.