HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Government Starts Own E Commerce Platform

Govt E Commerce: ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు పోటీ!

మన దేశంలో రిటైల్ మార్కెట్ విలువ దాదాపు రూ.75 లక్షల కోట్లు. అందుకే దీనిలో లాభాపేక్ష లేకుండా ఓ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ వస్తోంది.

  • Author : Hashtag U Date : 29-04-2022 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Consumer Protection E Commerce Rules Need For More Clarity Blog Imresizer
Consumer Protection E Commerce Rules Need For More Clarity Blog Imresizer

మన దేశంలో రిటైల్ మార్కెట్ విలువ దాదాపు రూ.75 లక్షల కోట్లు. అందుకే దీనిలో లాభాపేక్ష లేకుండా ఓ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ వస్తోంది. దానిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నందన్ నీలేకనితోపాటు మరికొంతమంది నిపుణులు.. ఓపెన్ టెక్నాలజీ నెట్ వర్క్ ఆధారంగా నడిచే ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ కు రూపకల్పన చేశారు. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్ సిటీల్లో ఈ నెట్ వర్క్ పైలెట్ ప్రాజెక్టు ఈ రోజు (29-04-2022) ప్రారంభం కానుంది. వాణిజ్య పరిశ్రమల శాఖ దీనిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.

ఈ పైలెట్ ప్రాజెక్టు కొద్ది మంది అమ్మకందారులు, వినియోగదారులతో మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగం కాని సక్సెస్ అయితే తరువాత 100 నగరాలకు విస్తరించడానికి ప్లాన్ చేస్తు్న్నారు. మన దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ పై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ దే ఆధిపత్యం. మార్కెట్ లో వీటి వాటా దాదాపు 80 శాతం ఉంటుందని అంచనా. దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవి మార్కెట్ లో క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు వీటికి సవాల్ విసిరి నిలబడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

నిజానికి మొత్తం రిటైల్ మార్కెట్ లో ఆన్ లైన్ అమ్మకాల విలువ ఇప్పటివరకు ఆరు శాతమే ఉంది. ఇంకా 94 శాతం మార్కెట్ ఎక్కడిక్కడ కేంద్రీకృతమై ఉంది. దీనిపై కిరాణా షాపుల వాళ్లు చాలామంది ఆధారపడి ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం చిన్న దుకాణదారులు కూడా అమ్మకాలు జరుపుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ప్లాట్ ఫామ్ రూపొందించాలని సంకల్పించింది. అందుకే 9 మంది సభ్యుల సలహా సంఘాన్ని
ఏర్పాటుచేసింది.

ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ – ఓఎన్డీసీ పేరుతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇది నడుస్తుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన యూపీఐ సక్సెస్ అయ్యింది. దానిలాగే ఈ ప్లాట్ ఫామ్ కూడా విజయవంతమవుతుందని ఆశిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థతో చాలా కంపెనీలు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. కిరాణా సరుకులు మొదలు.. ఫ్లైట్ టిక్కెట్ వరకు అన్నింటినీ ఇక్కడ అమ్ముకోవచ్చు..
కొనుక్కోవచ్చు. ఇక దేశంలో 80 కోట్లమంది మొబైల్ వినియోగదారులు ఉండడం వల్ల ఎక్కువమందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • central government
  • e commerce
  • flipkart

Related News

Kd The Devil Singer Mangli

మరో వివాదంలో సింగర్ మంగ్లీ

Singer Mangli  ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ: ది డెవిల్ చిత్రంలోని ‘సర్కే చునార్’ పాటలో అసభ్యత ఉందన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు స్పందిస్తూ, అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలగించాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, అసభ్యకర నృత్యాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవ్వడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్

  • Andhra Pradesh Funds

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

  • Induction cooktops sell out in India as LPG crisis

    గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

Latest News

  • Air Passengers : విమాన ప్రయాణికులకు శుభవార్త

  • గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ

  • ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

  • TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్‌లైన్లో పోటీ పరీక్ష

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd