HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Pay Rs90 Lakhs For The Nuptial Night Bride Sets Shocking Condition

First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..

  • Author : Vamsi Chowdary Korata Date : 14-04-2026 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
First Night Shock
First Night Shock

ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ నవవధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని చూపించింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన యువకుడికి గతేడాది ఏప్రిల్ 29న కల్పన అనే యువతితో వివాహం జరిగింది. శోభనం రోజు రాత్రి గదిలోకి వెళ్లాక, తనకు రూ.90 లక్షల నగదు ఇస్తేనే ముసుగు తీస్తానని ఆమె భర్తకు షరతు పెట్టింది. అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదని అతను స్పష్టం చేయడంతో, మరుసటి రోజే ఆమె పెళ్లి నగలన్నింటితో పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఏడాది పాటు కల్పన, ఆమె కుటుంబ సభ్యులు వరుడిని వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ, ఇంటిపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 26న కల్పన తండ్రి, సోదరుడు వరుడి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఉద్దేశపూర్వకంగా ఇంట్లోని పీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి, నిప్పు అంటించి కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో వరుడితో పాటు అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం జోక్యంతో, ఆగ్రా పోలీసులు తాజాగా వధువు కల్పనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agra
  • bride demands money
  • crime
  • dowry
  • First Night
  • Kalpana
  • Uttar pradesh

Related News

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd